Home /News /movies /

HUGE LOSS FOR DISTRIBUTORS AND BUYERS FOR ALLARI BULLODU MOVIE DETAILS HERE MHN

Allari Naresh: అల్లరి నరేష్ దెబ్బకు నిండా మునిగిపోయారు.. ఇప్పుడెలా?

Huge loss for Distributors and buyers for Allari Bullodu movie details here

Huge loss for Distributors and buyers for Allari Bullodu movie details here

Allari Naresh: బంగారుబుల్లోడు సినిమాతో అయినా త‌నకు క‌లిసొస్తుందేమో అని భావించిన న‌రేశ్‌కు నిరాశ త‌ప్ప‌లేదు. ఈ సినిమా వల్ల డిస్ట్రిబ్యూట‌ర్స్‌, బ‌య‌ర్స్ ఎంత నష్టపోయారంటే..

    కామెడీ స్టార్‌గా ఓ వెలుగు వెలిగిన అల్ల‌రి న‌రేశ్ ప‌రిస్థితి అస్స‌లు బాగుండటం లేదు. ఆయ‌న చేస్తున్న సినిమాల‌న్నీ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బోల్తా కొట్టేస్తున్నాయి. రీసెంట్‌గా రిలీజైన బంగారుబుల్లోడు సినిమాతో అయినా త‌నకు క‌లిసొస్తుందేమో అని భావించిన న‌రేశ్‌కు నిరాశ త‌ప్ప‌లేదు. బంగారు బుల్లోడు ప్లాప్ కాదు.. ఏకంగా డిజాస్ట‌ర్ అయ్యింది. ఈ సినిమా ప‌రంగా నిర్మాత సేఫ్ అయినా, డిస్ట్రిబ్యూట‌ర్స్‌, బ‌య‌ర్స్ త‌ల‌పై గుడ్డ వేసుకోవాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. అస‌లు బంగారు బుల్లోడు సినిమా విష‌యంలో ఏం జ‌రిగింది? డిస్ట్రిబ్యూట‌ర్స్‌, బ‌య్య‌ర్లు ఎంత న‌ష్ట‌పోయారు అనే వివ‌రాల్లోకి వ‌స్తే...

    బంగారు బుల్లోడు సినిమా కోసం నాలుగు కోట్ల రూపాయ‌ల బ‌డ్జెట్ అయ్యింది. ఇక థియేట్రిక‌ల్ బిజినెస్ ప‌రంగా చూస్తే...మూడు కోట్ల రూపాయ‌ల బిజినెస్ జ‌రిగింది. నాన్ థియేట్రిక‌ల్ రైట్స్ అవ‌న్నీ సేల్ చేసుకుంటే నిర్మాత‌ల‌కు వారు పెట్టిన మొత్తం వ‌చ్చేస్తుంద‌న‌డంలో సందేహం లేదు. అయితే థియేట్రిక‌ల్ రైట్స్ కొన్న డిస్ట్రిబ్యూట‌ర్స్‌, బ‌య్య‌ర్ల ప‌రిస్థితే ఏమీ అర్థం కావ‌డం లేదు. ఎందుకంటే ఇప్ప‌టి వ‌ర‌కు అన్ని ఏరియాల్లో క‌లిపి దాదాపు డెబ్బై ఐదు ల‌క్ష‌ల రూపాయ‌ల దాకానే వ‌చ్చాయి. ఇంకా రావాల్సింది. రెండు కోట్ల పైమాటే.

    మ‌రి ఈ న‌ష్టాన్ని నిర్మాత‌లు ఏమైనా కాస్తో కూస్తో తీర్చితే అల్ల‌రి నరేశ్ నెక్ట్స్ మూవీకి బిజినెస్ విష‌యంలో డిస్ట్రిబ్యూట‌ర్స్ కాస్త ధైర్యం చేస్తారు. పోతే పోనీలే అని అనుకుంటే మాత్రం ఆ ఎఫెక్ట్ అల్ల‌రి న‌రేశ్ నెక్ట్స్ చేయ‌బోయే సినిమాల‌పై ప‌డుతుందన‌డంలో సందేహం లేదు.
    Published by:Anil
    First published:

    Tags: Allari naresh, Bangaru Bullodu

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు