‘యాత్ర’ Vs ‘మహానాయకుడు’.. ముఖ్యమంత్రుల వార్‌లో విజయం ఎవరిది..?

ఇద్ద‌రు తెలుగు రాష్ట్రాల భ‌విష్య‌త్తును మార్చేసిన మాస్ లీడ‌ర్స్.. లెజెండరీ నాయ‌కులే. ఆ పేర్లు వింటే చాలు అభిమానుల న‌రాల్లో క‌రెంట్ పాస్ అవుతుంది. కేవ‌లం రాజ‌కీయ నాయ‌కుల్లా కాకుండా ప్ర‌జ‌ల‌కు వాళ్లు మ‌హానాయ‌కులుగా నిలిచిపోయారు. వాళ్లే ఎన్టీఆర్.. వైఎస్ఆర్. వీళ్ల సినిమాలు ఒక్క వారం గ్యాప్‌లో వస్తున్నాయి.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: January 22, 2019, 11:57 AM IST
‘యాత్ర’ Vs ‘మహానాయకుడు’.. ముఖ్యమంత్రుల వార్‌లో విజయం ఎవరిది..?
ఎన్టీఆర్ వైఎస్సార్ పోస్టర్స్
  • Share this:
ఇద్ద‌రు తెలుగు రాష్ట్రాల భ‌విష్య‌త్తును మార్చేసిన మాస్ లీడ‌ర్స్.. లెజెండరీ నాయ‌కులే. ఆ పేర్లు వింటే చాలు అభిమానుల న‌రాల్లో క‌రెంట్ పాస్ అవుతుంది. కేవ‌లం రాజ‌కీయ నాయ‌కుల్లా కాకుండా ప్ర‌జ‌ల‌కు వాళ్లు మ‌హానాయ‌కులుగా నిలిచిపోయారు. వాళ్లే ఎన్టీఆర్.. వైఎస్ఆర్. ఈ ఇద్ద‌రు ముఖ్య‌మంత్రుల బ‌యోపిక్‌లు ఇప్పుడు తెర‌కెక్కుతున్నాయి. విచిత్రంగా ఈ రెండు సినిమాలు ఇప్పుడు ఒకేసారి విడుద‌ల అవుతున్నాయి. ఇదే ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారుతున్న విష‌యం. ఎన్టీఆర్ బ‌యోపిక్ రెండు భాగాలుగా వ‌స్తుంది. ‘క‌థానాయ‌కుడు’ జ‌న‌వ‌రి 9న వచ్చి డిజాస్టర్ అయిపోయింది.

ntr biopic,ntr mahanayakudu movie,mahanayakudu release date,ysr yatra movie releasing on feb 8,yatra movie release date ysr,ntr vs ysr,ntr biopic twitter,telugu cinema,ఎన్టీఆర్ వైఎస్ఆర్,ఎన్టీఆర్ బయోపిక్,ఎన్టీఆర్ మహానాయకుడు,వైఎస్ఆర్ యాత్ర,బాలకృష్ణ మమ్ముట్టి,నందమూరి బాలక‌ృష్ణ మమ్ముట్టి,ఫిబ్రవరి 14న ఎన్టీఆర్ మహానాయకుడు,ఫిబ్రవరి 8న యాత్ర విడుదల
ఎన్టీఆర్ బయోపిక్


మ‌హానాయ‌కుడు మాత్రం ముందు జ‌న‌వ‌రి 25న విడుద‌ల కానుంద‌ని చెప్పినా కూడా ఇప్పుడు అది అనివార్య కార‌ణాల‌తో ఫిబ్ర‌వ‌రి 7న వెళ్లిపోయింది. అయితే ఇప్పుడు ఈ తేదీ కూడా కాదని ఫిబ్రవరి 14కి వెళ్లిపోయింది మహానాయకుడు. ‘మ‌హానాయ‌కుడు’ వ‌చ్చేది ఫిబ్రవరి 14నే అని కన్ఫర్మ్ చేసారు దర్శక నిర్మాతలు. ఇక దానికి సరిగ్గా వారం రోజుల ముందు అంటే ఫిబ్ర‌వ‌రి 8న వైఎస్ఆర్ బ‌యోపిక్ యాత్ర విడుద‌ల కానుంది. ఇప్ప‌టికే ఈ చిత్ర విడుద‌ల‌పై ప్ర‌క‌ట‌న కూడా చేసారు ద‌ర్శ‌క నిర్మాత‌లు.

ntr biopic,ntr mahanayakudu movie,mahanayakudu release date,ysr yatra movie releasing on feb 8,yatra movie release date ysr,ntr vs ysr,ntr biopic twitter,telugu cinema,ఎన్టీఆర్ వైఎస్ఆర్,ఎన్టీఆర్ బయోపిక్,ఎన్టీఆర్ మహానాయకుడు,వైఎస్ఆర్ యాత్ర,బాలకృష్ణ మమ్ముట్టి,నందమూరి బాలక‌ృష్ణ మమ్ముట్టి,ఫిబ్రవరి 14న ఎన్టీఆర్ మహానాయకుడు,ఫిబ్రవరి 8న యాత్ర విడుదల
యాత్ర మూవీ పోస్టర్స్
మ‌హి వి రాఘ‌వ తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రంలో మ‌మ్ముట్టి వైఎస్ పాత్ర‌లో న‌టించాడు. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ‘యాత్ర’ పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లో బిజీగా ఉంది. ఈ రెండు బ‌యోపిక్‌లు ఒక్క‌ వారం గ్యాప్‌లో రానుండ‌టంతో ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. ఇద్ద‌రు లెజెండ‌రీ ముఖ్య‌మంత్రుల మ‌ధ్య బాక్సాఫీస్ పోరు ఎలా ఉండ‌బోతుందో అనే ఆస‌క్తి అంద‌ర్లోనూ క‌నిపిస్తుందిప్పుడు. మ‌రి చూడాలిక‌.. ఎన్టీఆర్ వ‌ర్సెస్ వైఎస్ఆర్ మ‌ధ్య పోరు ఎలా ఉండ‌బోతుందో..?
First published: January 22, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...