ఆ నిర్మాణ సంస్థపై అన్నీ విమర్శలే.. హీరోనే మెయిన్ విలన్..

టాలీవుడ్‌లో ఆయనో కుర్ర హీరో. మొదట్లో వరుస విజయాలు అందుకుని ఆ తర్వాత పూర్తిగా రేసులో వెనకబడిపోయాడు ఈయన. దానికితోడు ఈ మధ్యే సొంత ప్రొడక్షన్ హౌజ్ కూడా మొదలుపెట్టి అందులో..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: February 26, 2020, 4:18 PM IST
ఆ నిర్మాణ సంస్థపై అన్నీ విమర్శలే.. హీరోనే మెయిన్ విలన్..
నిర్మాణ సంస్థపై విమర్శలు (production house)
  • Share this:
టాలీవుడ్‌లో ఆయనో కుర్ర హీరో. మొదట్లో వరుస విజయాలు అందుకుని ఆ తర్వాత పూర్తిగా రేసులో వెనకబడిపోయాడు ఈయన. దానికితోడు ఈ మధ్యే సొంత ప్రొడక్షన్ హౌజ్ కూడా మొదలుపెట్టి అందులో మూడు సినిమాలు కూడా నిర్మించాడు. అయితే ఈ నిర్మాణ సంస్థపై ఇండస్ట్రీలో ఇప్పుడు చాలా రూమర్స్ వినిపిస్తున్నాయి. ముఖ్యంగా తమ నిర్మాణ సంస్థలో పని చేసిన వాళ్ల డబ్బులు ఎగరగొడుతున్నారంటూ వాళ్లపై విమర్శలు వస్తున్నాయి. ఇంత దారుణమైన నిర్మాణ సంస్థను ఎక్కడా చూడలేదంటూ అంతా సోషల్ మీడియా ఎక్కి మరీ రచ్చ చేస్తున్నారు. ఈ మధ్యే ఓ సినిమా చేసిన ఈ కుర్ర హీరో.. ఫ్లాప్ అయిన సినిమాను కూడా హిట్ హిట్ అంటూ పార్టీలు కూడా చేసుకున్నాడు. తీరా చూస్తే ఈ చిత్రం వాళ్లకు నష్టాలే తీసుకొచ్చింది.
నిర్మాణ సంస్థపై విమర్శలు (production house)
నిర్మాణ సంస్థపై విమర్శలు (production house)

రెండేళ్ల కింద బ్లాక్ బస్టర్ సినిమాతో నిర్మాణ సంస్థను మొదలుపెట్టి.. రెండేళ్లు తిరిగేసరికి రెండు ఫ్లాపులు ఇచ్చారు వాళ్లు. పైగా మొన్నటి సినిమా విషయంలో మాత్రం చాలా రచ్చ జరిగిందని తెలుస్తుంది. ముఖ్యంగా హీరో కూడా కథ నాదే అంటూ రచ్చ చేయడం.. ఆ తర్వాత ఫిల్మ్ ఛాంబర్‌లో మరో రచయిత వచ్చి తన కథను ఆ సదరు హీరో కొట్టేసాడని కంప్లైంట్ చేయడం జరిగింది. ఆయనకు 3 లక్షల వరకు ఇచ్చి మ్యాటర్ సెటిల్ చేసి.. తన కథే అంటూ ప్రమోట్ చేసుకున్నాడని ఆయన సన్నిహితులే చెబుతున్నారు. మరోవైపు ముందు సినిమా కథ కూడా తానే ఇచ్చానని చెప్పి.. ఆ దర్శకుడి చేతిలో చివాట్లు కూడా తిన్నాడు ఈ కుర్ర హీరో. ఇక వాళ్ల అమ్మానాన్నలు కూడా తమ నిర్మాణ సంస్థలో పని చేసిన వాళ్లకు కనీసం డబ్బులు కూడా ఇవ్వకుండా తిప్పించుకుంటున్నారని.. వీళ్ల తీరు నచ్చక ఓ హీరోయిన్ ఏకంగా సోషల్ మీడియాలో విమర్శల వర్షం కురిపించింది.

నిర్మాణ సంస్థపై విమర్శలు (production house)
నిర్మాణ సంస్థపై విమర్శలు (production house)

దానికితోడు మ్యూజిక్ డైరెక్టర్‌కు కూడా డబ్బులు ఇవ్వకపోతే ఆయన కూడా రచ్చ చేస్తున్నాడని వార్తలొస్తున్నాయి. ఇక సినిమాటోగ్రఫర్‌కు కూడా కొన్ని లక్షలు ఎగ్గొట్టారని.. దాంతో ఇండస్ట్రీలో ఉన్న ఓ అగ్ర దర్శకుడితో ఫోన్ చేయిస్తే కానీ పని జరగలేదని తెలుస్తుంది. అన్నింటికీ మించి ఆ హీరో గారు కూడా ఇష్టమొచ్చినట్లు కథలో, దర్శకత్వంలో వేలు పెట్టేయడంతో సినిమా రూపురేఖలు మారిపోతున్నాయి. అందుకే తొలి సినిమాకు పని చేసిన వాళ్లలో ఒక్కరు కూడా ఆ నిర్మాణ సంస్థలో మరో సినిమాకు చేయలేకపోతున్నారు. ఇలా ఒకటా రెండా.. ఆ నిర్మాణ సంస్థపై.. హీరో గారిపై ఎన్నో విమర్శలు వస్తున్నాయి. దాంతో ఇప్పుడు ఏం చేయాలో తెలియని డైలమాలో పడిపోయారు సదరు హీరో గారూ. ఈయనతో బయటి నిర్మాతలు సినిమాలు చేయడానికి కూడా ఆలోచిస్తున్నారిప్పుడు.

First published: February 26, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు