Super 30 Trailer Talk: హృతిక్ రోషన్ లెక్కలు వేరేగా ఉన్నాయిగా..

సూపర్ 30 లో హృతిక్ రోషన్

గత కొన్నేళ్లుగా బాలీవుడ్‌లో రియల్ లైఫ్ స్టోరీలతో తెరకెక్కిన బయోపిక్‌లు సంచలన విజయాలు సాధిస్తున్నాయి. తాజాగా బాలీవుడ్ సూపర్ హీరో హృతిక్ రోషన్.. ‘సూపర్ 30’ అనే సినిమాలో ఫేమస్ లెక్కల మాస్టర్ ఆనంద్ కుమార్ పాత్రలో నటిస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదలైంది.

  • Share this:
    గత కొన్నేళ్లుగా బాలీవుడ్‌లో రియల్ లైఫ్ స్టోరీలతో తెరకెక్కిన బయోపిక్‌లు సంచలన విజయాలు సాధిస్తున్నాయి. తాజాగా బాలీవుడ్ సూపర్ హీరో హృతిక్ రోషన్.. ‘సూపర్ 30’ అనే సినిమాలో ఫేమస్ లెక్కల మాస్టర్ ఆనంద్ కుమార్ పాత్రలో నటిస్తున్నాడు. అంతకు ముందు ‘కాబిల్’ సినిమాలో అంధుడిగా నటించి మెప్పించారు హృతిక్. తాజాగ ‘సూపర్ 30’ సినిమాలో ఎందరో పేద విద్యార్ధుల జీవితాల్లో వెలుగులు నింపిన మ్యాథ్స్ లెక్చరర్ ఆనంద్ కుమార్ పాత్రలో నటించాడు. అతనంటే విద్యార్దుల్లో ఎంతో గౌరవం ఉంది. తన లెక్కలతో ఎంతో మంది సామాన్యులను అసామాన్యలుగా తీర్చిదిద్దిన ఆయన జీవితం ఎందరికో స్పూర్తి దాయకం. వికాస్ బెహల్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ట్రైలర్‌ను రీసెంట్‌గా విడుదల చేసారు. ఈ ట్రైలర్‌లో భారత్.. ఓ చీప్ లేబర్ దేశం అంటూ స్టార్ట్ చేసారు. ఇలాంటి పేద దేశం నుంచే పెప్సికో సంస్థకు అధినేతగా ఎవరు అయ్యారు ? యూనిలివర్ సంస్థను ఎవరు రన్ చేస్తున్నారు. ? ఈ విషయాలు తెలియకపోతే గూగుల్‌లో సెర్చ్ చేయండి. అంతేకాదు గూగుల్‌ను ఎవరు శాసిస్తున్నది కూడా భారతీయులే అన్న డైలాగులు ఆకట్టుకునే విధంగా ఉన్నాయి.



    ‘సూపర్ 30’ లో ఆనంద్ కుమార్ అనే లెక్కల మాస్టర్ పాత్రలో హృతిక్ రోషన్ ఒదిగిపోయారు. ఆయన్ని ఓ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూల్ ఐఐటీ ప్రొఫెసర్‌గా నియమిస్తుంది. కానీ కొన్ని కారణాల వల్ల ఆయన విద్యాసంస్థలో ఉద్యోగం మానేసి ఫ్రీగా ఐఐటీ కోచింగ్ ఇస్తుంటాడు.ఇలా అతను ఎందుకు చేయాల్సి వచ్చింది. అందుకు దారి తీసిన పరిస్థితులు.. ఈ ప్రయాణంలో ఆయన ఎలాంటి సంఘటనలు ఫేస్ చేసాడనేదే ‘సూపర్ 30’ స్టోరీ. ఈ సినిమాను జూలై 12న రిలీజ్ కానుంది.
    First published: