Hrithik Roshan: బాలీవుడ్ గ్రీకు వీరుడు, స్టైలిష్ యాక్టర్ హృతిక్ రోషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ సూపర్ హీరో హృతిక్ రోషన్ ఈరోజు తన 48 వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. బాల నటుడిగా కెరీర్ ప్రారంభించిన హృతిక్ రోషన్.. ఆ తర్వాత తండ్రి రాకేష్ రోషన్ (Rakesh Roshan) దర్శక నిర్మాణంలో తెరకెక్కిన పలు చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసారు. అయితే సినీ ఇండస్ట్రీ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చినప్పటికీ.. కెరీర్ ప్రారంభంలో బాలీవుడ్‌లో నిలదొక్కుకునేందుకు హృతిక్ చాలా కష్టాలే పడ్డాడు. ఆ తర్వాత తండ్రి రాకేష్ రోషన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కహో నా ప్యార్ హై’ సినిమాతో హీరోగా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. అంతేకాదు ఫస్ట్ సినిమాతో హిందీ చిత్ర పరిశ్రమలో అన్ని రికార్డులను బద్దలు కొట్టాడు.
అంతేకాదు ‘కహో నా ప్యార్ హై’ తర్వాత ఓవర్ నైట్ స్టార్ హీరో అయ్యాడు. ఆ చిత్రం తర్వాత కొన్ని పరాజయాలు ఎదురైనా.. మళ్లొసారి తన తండ్రి దర్శకత్వంలో తెరకెక్కిన ‘కో మిల్ గయా’, ‘క్రిష్’ సిరీస్‌తో బాలీవుడ్ సూపర్ హీరో ఇమేజ్ సంపాదించాడు. 2019లో హృతిక్ రోషన్ వికాస్ బహ్ల్ దర్శకత్వంలో ‘సూపర్ 30’ సినిమాతో పలకరించారు. ఈ చిత్రంలో హృతిక్..ఫేమస్ లెక్కల మాస్టారు ఆనంద్ కుమార్ పాత్రలో అదరగొట్టారు.
HBD Allu Aravind : హ్యాపీ బర్త్ డే అల్లు అరవింద్.. బావ చిరంజీవితో ఈయనది బ్లాక్ బస్టర్ కాంబినేషన్..
ఆ తర్వాత సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తోటి హీరో టైగర్ ష్రాఫ్‌తో ‘వార్’ అనే మల్టీస్టారర్ సినిమాతో భారీ సక్సెస్ అందుకున్నారు. ఆ తర్వాత తన తండ్రి రాకేష్ రోషన్ దర్శకత్వంలో ‘క్రిష్ 4’ మూవీ చేస్తున్నారు. ప్రస్తుతం హృతిక్ రోషన్.. సిద్ధార్ధ్ ఆనంద్ దర్శకత్వంలో ‘ఫైటర్’ మూవీ చేస్తున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. దాంతో పాటు కోలీవుడ్‌లో విజయ్ సేతుపతి, మాధవన్ హీరోలుగా తెరకెక్కిన ‘విక్రమ్ వేద’ సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్నారు.
'VIKRAM VEDHA': HRITHIK FIRST LOOK AS VEDHA... #FirstLook of #HrithikRoshan as #Vedha from #VikramVedha... Costars #SaifAliKhan and #RadhikaApte... Pushkar-Gayathri - who directed the original #Tamil film - direct this film. #VedhaFirstLook #HappyBirthdayHrithikRoshan pic.twitter.com/PDjpjDhFVA
— taran adarsh (@taran_adarsh) January 10, 2022
ఒరిజినల్‌ను డైరెక్ట్ చేసిన పుష్కర్ గాయత్రి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ఈ రోజు హృతిక్ రోషన్ బర్త్ డే సందర్భంగా ‘వేద’గా ఆయన లుక్‌ను విడుదల చేసారు. విక్రమార్కుడు, బేతాళుడు కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కించారు. తెలుగులో ఈ సినిమాను రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నారు. ఇక హిందీలో విక్రమ్ పాత్రలో సైఫ్ అలీ ఖాన్ నటిస్తూ ఉంటే.. వేద పాత్రలో హృతిక్ రోషన్ నటిస్తున్నారు. ఈ సినమాను రిలయన్స్ ఎంటర్టైన్మెంట్, టీ సిరీస్‌తో వై నాట్ స్టూడియోస్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను 30 సెప్టెంబర్‌ను విడుదల చేస్తున్నారు.
ఇదిలా ఉంటే హీరోగా మారకముందు చైల్డ్ ఆర్టిస్ట్‌గా పలు చిత్రాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించారు హృతిక్. అందులో రజనీకాంత్, శ్రీదేవి, రాకేష్ రోషన్ ప్రధాన పాత్రల్లో జె.ఓం ప్రకాష్(హృతిక్ తాత) తెరకెక్కించిన భగవాన్ దాదా మూవీ ఒకటి. ఈ మూవీలో హృతిక్ నటనను మంచి మార్కులే పడ్డాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.