కరోనా పై పోరాటంలో తన ఉదారతను చాటుకున్న హృతిక్ రోషన్..

హృతిక్ రోషన్: 290 కోట్లు

ప్రస్తుతం  మనదేశంతో పాటు ప్రపంచ దేశాలను కరోనా వైరస్ కంటి మీద కునుకు లేకండా  భయభ్రాంతులకు గురి చేస్తోంది. ఈ వైరస్ నివారణ కోసం దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 21 రోజుల పాటు దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. అందులో భాగంగా హృతిక్ రోషన్ తన వంతు సాయం చేయడానికి ముందుకు వచ్చాడు.

  • Share this:
ప్రస్తుతం  మనదేశంతో పాటు ప్రపంచ దేశాలను కరోనా వైరస్ కంటి మీద కునుకు లేకండా  భయభ్రాంతులకు గురి చేస్తోంది. ఈ వైరస్ నివారణ కోసం దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 21 రోజుల పాటు దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే కరోనాపై పోరాటంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు తమవంతు సాయం చేయడంలో నిమగ్నమయ్యాయి. మరోవైపు ప్రధాని పిలుపు మేరకు ఇప్పటికే దేశ ప్రజలు చప్పట్లతో పాటు... దీపాలు వెలిగించి కరోనా పై పోరులో దేశ ప్రజలంతా ఒక్కటే అని నిరూపించారు. మరోవైపు కరోనా పై పోరులో  సినీ నటులు కూడా దేశానికి, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు  అండగా నిలుస్తున్నారు.ఇప్పటికే చాలా మంది తెలుగు సినిమా నటులు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు పీఎం రిలీఫ్ డ్‌కు తమ వంతు ఆర్ధిక సాయం అందిస్తున్నారు. అటు తమిళ సినీ నటులు తమ సినీ కార్మికులను ఆదుకోవడం కోసం తమ వంతు సాయం చేస్తున్నారు. మరోవైపు బాలీవుడ్ నటులు ఒక్కొక్కరుగా తమ వంతు విరాళాలు ప్రకటిస్తున్నారు. తాజాగా హృతిక్ రోషన్ కూడా కరోనా పై పోరులో తన వంతుగా సాయం చేయడానికి ముందుకు వచ్చారు.


ఐతే.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తన వంతు సాయం కాకుండా  అక్షయ పాత్ర ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థతో కలిసి రోజువారీ కూలీ నాలీ చేసుకునే వారికి ఒక లక్ష 20 మీల్స్‌ను ప్రతిరోజు లాక్‌డౌన్ ఎప్పటి వరకు ఉంటే అప్పటి వరకు ఉచితంగా భోజన సదుపాయం కల్పించనున్నట్టు తెలిపారు. వీళ్లతో పాటు సీనియర్ సిటిజన్స్‌కు కూడా భోజన సదుపాయం కల్పించాలని నిర్ణయించారు. మొత్తానికి కరోనా పై పోరాటంలో హృతిక్ రోషన్ తన వంతుగా సాయం చేయడానికి ముందుకు రావడం మంచి విషయమనే చెప్పాలి.

Published by:Kiran Kumar Thanjavur
First published: