Hrithik Roshan: తమిళంలో మాధవన్, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో నటించిన విక్రమ్ వేదా మూవీ హిందీలో రీమేక్ అవుతోన్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా ఆ మధ్యనే వచ్చేసింది. ఇక ఈ రీమేక్ కోసం మొదటగా సైఫ్ అలీ ఖాన్, ఆమిర్ ఖాన్ పేర్లు వినిపించాయి. మాధవన్ పాత్రలో సైఫ్, విజయ్ సేతుపతి పాత్రలో ఆమిర్ నటించబోతున్నట్లు టాక్ నడిచింది. అయితే తాజా సమాచారం ప్రకారం విజయ్ సేతుపతి పాత్రలో హృతిక్ నటించబోతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన హృతిక్ గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేసినట్లు సమాచారం. అంతేకాదు త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది.
కాగా పుష్కర్- గాయత్రి దర్శకత్వం వహించిన విక్రమ్ వేదా 2017లో విడుదలైంది. ఇందులో మాధవన్ పోలీస్ ఆఫీసర్‌గా, విజయ్ సేతుపతి గ్యాంగ్‌స్టర్‌గా నటించారు. శ్రద్ధా శ్రీనాథ్, వరలక్ష్మి శరతకుమార్, కథిర్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. శ్యామ్ సీఎస్ సంగీతం అందించిన ఈ మూవీకి ఎన్నో అవార్డులు రివార్డులు వచ్చాయి. అంతేకాదు బాక్సాఫీస్ వద్ద కూడా మంచి కలెక్షన్లను రాబట్టింది.
ఇక ఇప్పుడు ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తున్నారు. ఒరిజనల్‌కి దర్శకత్వం వహించిన పుష్కర్-గాయత్రినే హిందీలో కూడా ఈ రీమేక్‌కి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ రీమేక్‌పై బాలీవుడ్‌లోనూ మంచి అంచనాలు ఉన్నాయి. త్వరలోనే షూటింగ్‌ను ప్రారంభించి.. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేలా ప్లాన్ చేసినట్లు సమాచారం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hrithik Roshan, Vijay Sethupathi