చైనాలో విడుదలకానున్న హృతిక్ రోషన్ సూపర్ 30..

మరోవైపు హృతిక్ రోషన్.. సూపర్ 30 సినిమాతో పోటీ పడుతున్నారు. ఇంకోవైపు అజయ్ దేవ్‌గణ్ ‘తానాజీ’ తో పాటు రణ్‌వీర్ సింగ్ గల్లీబాయ్‌తో పాటు.. ధనుష్ రెండు సినిమాలు, మలయాళం మోహన్ లాల్, మమ్ముట్టి కూడా పోటీపడుతున్నట్టు సమాచారం. (Twitter/Photo)

హిందీ సూపర్ స్టార్ హృతిక్‌రోషన్‌ నటించిన బయోపిక్‌ సూపర్‌ 30. ప్రముఖ గణిత శాస్త్రజ్ఞుడు బీహార్‌కి చెందిన ఆనంద్‌కుమార్‌ జీవితం ఆధారంగా తెరకెక్కింది.

  • Share this:
    హిందీ సూపర్ స్టార్ హృతిక్‌రోషన్‌ నటించిన బయోపిక్‌ సూపర్‌ 30. ప్రముఖ గణిత శాస్త్రజ్ఞుడు బీహార్‌కి చెందిన ఆనంద్‌కుమార్‌ జీవితం ఆధారంగా తెరకెక్కింది. ఆనంద్‌కుమార్‌ దేశంలోనే ప్రతిష్ఠాత్మక ఐఐటీ విశ్వవిద్యాలయాల్లో బడుగులకు కూడా సీట్స్ దక్కాలన్న ఆశయంతో సూపర్‌ 30ని ఏర్పాటు చేశాడు. ఆయన నిజ జీవిత పాత్రను హృతిక్‌రోషన్‌ పోషించాడు. అంతేకాదు ఆయనలా జీవించాడు. హిందీలో ఆ మధ్య విడుదలై ఆ సినిమా బాక్సాఫీసు వద్ద భారీ విజయాన్ని నమోదు చేసింది. దాదాపు రూ.100 కోట్లు రాబట్టి అదరగొట్టింది. కాగా ఈ సినిమా ఇప్పుడు చైనాలో విడుదలకానుంది. ప్రస్తుతం చైనాలో పరిస్థితులు కుదుటపడుతున్న నేపథ్యంలో వుహాన్‌లో ఈమధ్యే లాక్‌డౌన్‌ను ఎత్తివేశారు. ఈ పరిస్థితులన్నీ కుదురుకున్నాక చైనాలో విడుదలయ్యే మొదటి బాలీవుడ్‌ చిత్రంగా హృతిక్‌ రోషన్‌ నటించిన సూపర్‌ 30 నిలువనుందని తెలుస్తోంది. అందులో భాగంగా చైనాలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది చిత్రబృందం. ఈ సినిమాకు సంబందించి ఆల్రెడీ చైనాలో సెన్సార్‌ కోసం అప్లై చేసిందట చిత్రబృందం. సెన్సార్ పూర్తయిన వెంటనే మూవీ విడుదల తేదీ ప్రకటిస్తారట. ఈ సినిమాను వికాస్ బల్ దర్శకత్వం వహించాడు.
    Published by:Suresh Rachamalla
    First published: