Vikram Vedha Teaser Talk: హృతిక్ రోషన్, సైఫ్ అలీ ఖాన్ టైటిల్ రోల్స్ పోషించిన లేటెస్ట్ మూవీ ‘విక్రమ్ వేద’. తమిళంలో విజయ్ సేతుపతి, మాధవన్ ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రం అక్కడ సూపర్ హిట్టైయింది. ఆ సినిమాను డైరెక్ట్ చేసిన పుష్కర్ అండ్ గాయత్రి ఈ బాలీవుడ్ ప్రాజెక్ట్‌ను డైరెక్ట్ చేశారు. విక్రమార్కుడు, బేతాళుడు కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కించారు. తెలుగులో ఈ సినిమాను రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నారు. ఇక హిందీలో విక్రమ్ పాత్రలో సైఫ్ అలీ ఖాన్ యాక్ట్ చేశారు. వేద పాత్రలో హృతిక్ రోషన్ నటించారు. ఈ సినిమాను రిలయన్స్ ఎంటర్టైన్మెంట్, టీ సిరీస్‌తో వై నాట్ స్టూడియోస్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను 30 సెప్టెంబర్‌ను విడుదల చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను విడుదల చేసారు.
ఇక ఒరిజినల్ వెర్షన్ సినిమా చూసిన వాళ్లకు హిందీ వెర్షన్ టీజర్ అంతగా ఆకట్టుకోదు. పైగా హృతిక్ రోషన్, సైఫ్ అలీ ఖాన్ చేసిన విక్రమ్ వేద సినిమా హిందీలో కూడా డబ్ అయింది. పైగా అక్కడి ఆడియన్స్ ఈ సినిమాను చూశారు. పైగా ఒరిజినల్లో యాక్ట్ చేసిన విజయ్ సేతుపతి, మాధవన్‌తో పోలికలు కూడా ఉంటాయి.
HRITHIK - SAIF: 'VIKRAM VEDHA' POWER-PACKED TEASER OUT NOW... The wait is over... #HrithikRoshan [as #Vedha] and #SaifAliKhan [as #Vikram]... Check out the impactful #VikramVedhaTeaser...
Directed by #PushkarGayatri... 30 Sept 2022 release. pic.twitter.com/pQMTWPGJQs
— taran adarsh (@taran_adarsh) August 24, 2022
రీసెంట్గా షాహిద్ కపూర్ హీరోగా నటించిన ‘జెర్సీ’ సినిమాను బాలీవుడ్ ప్రేక్షకులు తిరస్కరించారు. ఎందుకంటే నాని నటించిన ‘జెర్సీ’ సినిమా హిందీ డబ్బింగ్ వెర్షన్ జీ 5 సహా పలు ఫ్లాట్‌ఫామ్‌లో ప్రేక్షకులు చూసేసారు. ఒకసారి ఒరిజినల్ వెర్షన్ చూసిన ప్రేక్షకులకు హిందీ ‘జెర్సీ’ సినిమాను థియేటర్స్‌లో చూడబుద్ది కాలేదు. దీంతో షాహిద్ కపూర్ ‘జెర్సీ’ అట్టర్ ఫ్లాప్ అయింది. ఈ సినిమాతో దిల్ రాజు, అల్లు అరవింద్ భారీగా నష్టపోయారు. ఇక ’జెర్సీ’ హిందీ వెర్షన్ మాత్రం ఓటీటీ వేదికగా మాత్రం సూపర్ హిట్టైయింది.
ఇపుడు ఆల్రెడీ హిందీ ప్రేక్షకులు ’విక్రమ్ వేద’ డబ్బింగ్ వెర్షన్‌ను ఓటీటీ, యూట్యూబ్ సహా పలు వేదికల్లో చూసేసారు. ఇక తాజాగా విడుదలైన ’విక్రమ్ వేద’ హిందీ టీజర్ ఏమంత ఆకట్టుకునేలా కనిపించలేదు. పైగా ఒరిజినల్‌కు జిరాక్స్ కాపీ అనే ముచ్చట వినబడుతోంది. ఇద్దరు కూడా పెద్దగా ఇంపాక్ట్ చూపించినట్టు కనబడలేదనే టాక్ వినబడుతోంది. మరి ఈ సినిమాకు బాలీవుడ్లో ఏ మేరకు ఆదరణ దక్కుతుందో చూడాలి. పైగా ఒకప్పటిలా హిందీలో రీమేక్ సినిమాలు చేస్తే ఎగేసుకుంటూ వెళ్లి ప్రేక్షకులు చూసేవాళ్లు. అపుడు అంత టెక్నాలజీ అందుబాటులో లేదు. పైగా అక్కడి ఆడియన్స్ ఆయా రీమేక్ సినిమాలను హిందీలో సూపర్ హిట్స్ చేసారు. పైగా ఇపుడు ప్యాన్ ఇండియా జమానా. దాంతో పాటు సినిమాలన్ని ఓటీటీ వేదికగా ప్రేక్షకులకు అందుబాటులో ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో హృతిక్ రోషన్, సైఫ్ అలీ ఖాన్ల ‘విక్రమ్ వేద’ బాలీవుడ్ బాక్సాఫీస్‌ను గట్టెక్కిస్తుందా లేదా అనేది చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bollywood news, Hrithik Roshan, Saif Ali Khan, Vikram Vedha