అల్లు అర్జున్ పై బాలీవుడ్ అగ్ర హీరో హృతిక్ రోషన్ ఆసక్తికర వ్యాఖ్యలు..

అల్లు అర్జున్ పై హృతిక్ ప్రశంసలు (Twitter/Photo)

Hrithik Roshan Allu Arjun | బాలీవుడ్ సూపర్ హీరో హృతిక్ రోషణ్.. సౌత్‌ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన అగ్ర హీరోలు అల్లు అర్జున్, విజయ్‌లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు.

 • Share this:
  బాలీవుడ్ సూపర్ హీరో హృతిక్ రోషణ్.. సౌత్‌ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన అగ్ర హీరోలు అల్లు అర్జున్, విజయ్‌లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు. తాజాగా ఆయన ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో దక్షిణాది చిత్రాలపై తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టాడు. ఈ సందర్భంగా హృతిక్..  అల్లు అర్జున్, విజయ్‌ డాన్స్‌ మూమెంట్స్‌ అంటే తనకు ఎంతో ఇష్టమన్నారు.  వీళ్లిద్దరి డాన్స్ చేయడానికి ముందు ఏమైనా సీక్రెట్‌ డైట్ పాటిస్తున్నారా అని కాస్తంత ఆశ్యర్యం వ్యక్తం చేసాడు. నాకు దక్షిణాది సినిమాలంటే చాల ా ఇష్టమన్నారు. కానీ ఈ మధ్యకాలంలో విడుదలైన ఒక సౌత్ సినిమాను తీరిక లేకపోవడంతో చూడలేకపోయానని చెప్పాడు. కానీ ఇక్కడి సినిమాల్లో టెక్నాలజీ వాడుకునే తీరుకు నేను అభిమాని. ఇక్కడ నుంచి నేను ఎంతో నేర్చుకున్నానన్నారు. సాధారణంగా నేను ఓ ప్రాజెక్ట్‌ను ఎంచుకునేటపుడు ఎలాంటి ఆలోచన లేకుండా ఒక నిమిషం వ్యవధిలో ఓకే చేసేస్తాను. అంత కంటే ఎక్కువ సమయం అయితే మాత్రం ఆ సినిమా చేసేది మాత్రం డౌటే అని చెప్పారు. ఈ నిమిషంలోనే నా మనసు, శరీరం, ఆత్మ ఏం చెబుతుందో అదే చేస్తుంటాని చెప్పుకొచ్చాడు.

  hrithik roshan interesting comments on allu arjun kollywood hero vijay here are the details,hrithik roshan,allu arjun,vijay,hrithik roshan allu arjun vijay,hrithik roshan praises allu arjun vijay dance movements,tollywood,telugu cinema,హృతిక్ రోషన్,అల్లు అర్జున్,విజయ్,హృతిక్ రోషన్ అల్లు అర్జున విజయ్,అల్లు అర్జున్ విజయ్ డాన్స్ మూమెంట్స్ పై హృతిక్ రోషన్ ప్రశంసలు
  అల్లు అర్జున్, విజయ్ లపై హృతిక్ ప్రశంసలు (Twitter/Photo)


  ఇక ఢాన్స్ విషయంలో హృతిక్ మాట్లాడుతూ.. ఏదైనా డాన్స్ మూమెంట్ చేయాలంటే ఎంతో సాధన అవసరం. నువ్వు మంచి యాక్టర్ అయితే.. ముఖంలో భావాల్ని పలకిలించాలి. ఎందుకంటే మనం డాన్స్ ఎంజాయ్ చేస్తే ముఖంలలో ఆ ఫీలింగ్స్ కనిపిస్తున్నాయి. అపుడు మూమెంట్స్ తప్పు చేసినా ఎలాంటి సమస్య ఉండదన్నారు. ఒక దక్షిణాదిలో తనకు అల్లు అర్జున్, విజయ్ డాన్స్ మూమెంట్స్ అంటే ఎంతో ఇష్టమన్నారు.వాళ్ల డాన్స్ మూమెంట్ ఎంతో ఎనర్జిటిక్, స్పూర్తిదాయకం, స్ట్రాంగ్ అని చెప్పుకొచ్చాడు. ముఖ్యంగా వీళ్లు డాన్స్ చేసే ముందు ఏం తింటారో అడిగి తెలుసుకుంటా అని కాస్త సరదగా వ్యాఖ్యానించడం విశేషం.
  Published by:Kiran Kumar Thanjavur
  First published: