మరోసారి పెద్ద మనసు చాటుకున్న హృతిక్ రోషన్..

బాలీవుడ్ అగ్ర హీరో మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నాడు. ఇప్పటికే అక్షయ పాత్ర ఫౌండేషన్ ద్వారా సాయం చేస్తోన్న హృతిక్ రోషన్.. పనిలేకుండా పోయినా వారికి..

news18-telugu
Updated: July 26, 2020, 8:59 AM IST
మరోసారి పెద్ద మనసు చాటుకున్న హృతిక్ రోషన్..
హృతిక్ రోషన్ (పైల్ ఫోటో)
  • Share this:
బాలీవుడ్ అగ్ర హీరో మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నాడు. ప్రస్తుతం మనదేశంతో పాటు ప్రపంచ దేశాలను కరోనా వైరస్ కంటి మీద కునుకు లేకండా  భయభ్రాంతులకు గురి చేస్తోంది. దీంతో షూటింగ్స్ లేక చాలా మందికి పని లేకుండా పోయింది. ప్రభుత్వం షరతులతో కూడిన పర్మిషన్ ఇచ్చినా.. ఇప్పటికే అమితాబ్ బచ్చన్‌, అభిషేక్ బచ్చన్‌తో పాటు మరికొంత మంది టీవీ నటీనటులకు కరోనా సోకడంతో చాలా మంది దర్శక, నిర్మాతలు ప్రస్తుతానికి షూటింగ్స్‌కు బ్రేక్ చెప్పారు. ఇప్పటికే హృతిక్ రోషన్ లాక్‌డౌన్ పీరియడ్‌లో అక్షయ పాత్ర ఫౌండేషన్ ద్వారా రోజువారీ కూలీలతో పాటు ఎలాంటి అండలేని పెద్దలకు భోజన సదుపాయం  కల్పించిన సంగతి తెలిసిందే కదా.

హృతిక్ రోషన్ (Twitter/Photo)


తాజాగా హృతిక్ రోషన్.. కరోనా నేపథ్యంలో ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న 100 మంది బ్యాక్ గ్రౌండ్ బాలీవుడ్ డాన్సర్లకు అండగా నిలిచాడు. అంతేకాదు వారి బ్యాంకు అకౌంట్‌లో డబ్బులు జమ చేశాడు. ఈ విషయాన్ని బాలీవుడ్ డాన్సర్స్ కో ఆర్డినేటర్ రాజు సూరానీ తెలిపారు. హృతిక్ రోషన్ చేసిన సాయంపై డాన్సర్స్ హర్షం వ్యక్తం చేసారు. అంతేకాదు కష్టకాలంలో తమకు అండగా నిలబడిని హీరోకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
Published by: Kiran Kumar Thanjavur
First published: July 26, 2020, 8:59 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading