హోమ్ /వార్తలు /సినిమా /

Hrithik Roshan - Fighter: హృతిక్ రోషన్ ‘ఫైటర్’ మూవీ షూటింగ్ కంప్లీట్.. కొత్త రిలీజ్ డేట్ ఇదే..

Hrithik Roshan - Fighter: హృతిక్ రోషన్ ‘ఫైటర్’ మూవీ షూటింగ్ కంప్లీట్.. కొత్త రిలీజ్ డేట్ ఇదే..

హృతిక్, సిద్ధార్ధ్ ఆనంద్ ‘ఫైటర్’ మూవీ షూటింగ్ కంప్లీట్ (Twitter/Photo)

హృతిక్, సిద్ధార్ధ్ ఆనంద్ ‘ఫైటర్’ మూవీ షూటింగ్ కంప్లీట్ (Twitter/Photo)

Hrithik Roshan - Deepika: హృతిక్ రోషన్, దీపికా పదుకొణే తొలిసారి జంటగా  నటిస్తోన్న చిత్రం ‘ఫైటర్’. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కంప్లీట్ అయింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Hrithik Roshan - Deepika: హృతిక్ రోషన్, దీపికా పదుకొణే తొలిసారి జంటగా  నటిస్తోన్న చిత్రం ‘ఫైటర్’. ఈ చిత్రాన్ని హృతిక్ రోషన్‌తో  ‘బ్యాంగ్ బ్యాంగ్’ ‘వార్’ సినిమాల డైరెక్టర్ సిద్ధార్ధ్ ఆనంద్ డైరెక్ట్ చేస్తున్నారు. వీళ్ల కలయికలో వస్తోన్న మూడో చిత్రం ‘ఫైటర్’. ఈ చిత్రాన్ని వయాకామ్ 18 నిర్మిస్తోంది. ఈ చిత్నాన్ని ఇప్పటికే రిలీజ్ డేట్స్ ఛేంజ్ చేసుకుంది. చివరకు 2024 జనవరి 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.   ఈ చిత్రంలో హృతిక్ రోషన్ భారత్ ఎయిర్ ఫోర్స్ అధికారి పాత్రలో కనిపించనున్నారు. అంతేకాదు ఈ సినిమా మన దేశంలో తొలి ఏరియల్ యాక్షన్ ఫిల్మ్‌గా తెరకెక్కుతోంది. గాల్లో ఫైట్స్ ప్రేక్షకులకు సరి కొత్త అనుభూతిని ఇస్తుందని చిత్ర దర్శక, నిర్మాతలు చెబుతున్నారు.

హాలీవుడ్ మూవీస్‌కు ఏ మాత్రం తగ్గకుండా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో పవర్‌ఫుల్ పాత్రలో ఒకప్పటి బాలీవుడ్ సూపర్ స్టార్ అనిల్ కపూర్ నటిస్తున్నారు. ఈచిత్రాన్ని వయాకామ్ 18 సంస్థ మార్‌ఫ్లిక్స్ సంస్థ‌తో పాటు సిద్ధార్ధ్ ఆనంద్ ఈ సినిమాకు సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. . ఈ చిత్రం మన దేశంలో తొలి ఏరియల్ ఫ్రాంఛైజీ మూవీగా రానుంది. ఈ చిత్రాన్ని అత్యాధునిక టెక్నాలజీతో ఎంతో ఉన్నతంగా తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కంప్లీటైంది. ఈ విషయాన్ని హృతిక్ తన సోషల్ మీడియాల అకౌంట్‌లో పోస్ట్ చేశారు. ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌తో పాటు గ్రాఫిక్స్ వర్క్ కారణంగా వచ్చే యేడాది ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు.

హృతిక్ రోషన్ ఈ సినిమాలో చేసే పోరాటాలు బాండ్ సినిమా లెవల్లో ఉంటాయని చెబుతున్నారు. ఇక హృతిక్ రోషన్, సిద్ధార్ధ్ ఆనంద్ కలయికలో వస్తోన్న మూడో చిత్రం. గత రెండు చిత్రాలు.. బ్యాంగ్ బ్యాంగ్, వార్ సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్న రీతిలోనే ఈ సినిమా కూడా ఉంటుందని చెబుతున్నారు. ఈ సినిమాలో హృతిక్ రోషన్ సరసన దీపికా  పదుకొణే తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకుంటోంది. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి. రీసెంట్‌గా సిద్ధార్ధ్  ఆనంద్.. షారుఖ్‌తో తెరకెక్కించిన ‘పఠాన్’ మూవీ బాలీవుడ్‌లో హిందీ వెర్షన్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డులకు ఎక్కింది. అంతేకాదు హిందీలో అది భారత్‌లో రూ. 1000 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించిన తొలి బాలీవుడ్ చిత్రంగా రికార్డులకు ఎక్కింది.

ఇక హృతిక్ రోషన్ తన తండ్రి రాకేష్ రోషన్ దర్శకత్వంలో ‘క్రిష్ 4’ మూవీ చేస్తున్నారు. మొత్తంగా హృతిక్ రోషన్ వరుస చిత్రాలతో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్నారు. ఇక హృతిక్, దీపికా కాంబినేషన్‌లో సిద్ధార్ధ్ ఆనంద్ తెరకెక్కిస్తోన్న ‘ఫైటర్’ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి.

First published:

Tags: Bollywood, Deepika Padukone, Fighter, Hrithik Roshan

ఉత్తమ కథలు