హోమ్ /వార్తలు /సినిమా /

Hrithik Roshan - Deepika: హృతిక్ రోషన్, దీపికా పదుకొణేల ‘ఫైటర్’ మూవీ విడుదల తేది ఖరారు..

Hrithik Roshan - Deepika: హృతిక్ రోషన్, దీపికా పదుకొణేల ‘ఫైటర్’ మూవీ విడుదల తేది ఖరారు..

హృతిక్ రోషన్, దీపికా పదుకొణే‌ల ‘ఫైటర్’ మూవీ విడుదల తేది ఖరారు (Twitter/Photo)

హృతిక్ రోషన్, దీపికా పదుకొణే‌ల ‘ఫైటర్’ మూవీ విడుదల తేది ఖరారు (Twitter/Photo)

Hrithik Roshan - Deepika: హృతిక్ రోషన్, దీపికా పదుకొణే తొలిసారి నటిస్తోన్న చిత్రం ‘ఫైటర్’. ఈ చిత్రాన్ని హృతిక్ రోషన్‌తో  ‘బ్యాంగ్ బ్యాంగ్’ ‘వార్’ సినిమాల డైరెక్టర్ సిద్ధార్ధ్ ఆనంద్ డైరెక్ట్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా విడుదల తేదిని ప్రకటించారు.

ఇంకా చదవండి ...

  Hrithik Roshan - Deepika: హృతిక్ రోషన్, దీపికా పదుకొణే తొలిసారి నటిస్తోన్న చిత్రం ‘ఫైటర్’. ఈ చిత్రాన్ని హృతిక్ రోషన్‌తో  ‘బ్యాంగ్ బ్యాంగ్’ ‘వార్’ సినిమాల డైరెక్టర్ సిద్ధార్ధ్ ఆనంద్ డైరెక్ట్ చేస్తున్నారు. వీళ్ల కలయికలో వస్తోన్న మూడో చిత్రం ‘ఫైటర్’. ఈ చిత్రాన్ని వయాకామ్ 18 నిర్మిస్తోంది. ఈ చిత్నాన్ని 2023 రిపబ్లిక్ డే కానుకగా విడుదల చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రంలో హృతిక్ రోషన్ భారత్ ఎయిర్ ఫోర్స్ అధికారి పాత్రలో కనిపించనున్నారు. ఈచిత్రాన్ని వయాకామ్ 18 సంస్థ మార్‌ఫ్లిక్స్ సంస్థ‌తో పాటు సిద్ధార్ధ్ ఆనంద్ ఈ సినిమాకు సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. . ఈ చిత్రం మన దేశంలో తొలి ఏరియల్ ఫ్రాంఛైజీ మూవీ. ఈ చిత్రాన్ని అత్యాధునిక టెక్నాలజీతో ఎంతో ఉన్నతంగా తెరకెక్కిస్తున్నట్టు ప్రకటించారు.

  హృతిక్ రోషన్ ఈ సినిమాలో చేసే పోరాటాలు బాండ్ సినిమా లెవల్లో ఉంటాయని చెబుతున్నారు. ఇక హృతిక్ రోషన్, సిద్ధార్ధ్ ఆనంద్ కలయికలో వస్తోన్న మూడో చిత్రం. గత రెండు చిత్రాలు.. బ్యాంగ్ బ్యాంగ్, వార్ సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్న రీతిలోనే ఈ సినిమా కూడా ఉంటుందని చెబుతున్నారు. ఈ సినిమాలో హృతిక్ రోషన్ సరసన దీపికా  పదుకొణే తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకోబోతుంది. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి. మొత్తంగా హృతిక్, దీపికా కాంబినేషన్‌లో సిద్ధార్ధ్ ఆనంద్ తెరకెక్కిస్తోన్న ‘ఫైటర్’ మూవీ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందనేది తెలియాలంటే 2023 రిపబ్లిక్ డే వరకు వెయిట్ చేయాల్సిందే.

  ఇవి కూడా చదవండి.. 

  Pawan Kalyan - Rana : పవన్ కళ్యాణ్, రానా మూవీ నుంచి అదిరిపోయిన క్రేజీ అప్డేట్..


  Nagarjuna - Jr NTR : నాగార్జునకు పెద్ద తల నొప్పిగా మారిన ఎన్టీఆర్ .. మరోసారి అక్కినేని Vs నందమూరి..


  HBD Sridevi : అప్పటి తరంలో శ్రీదేవి.. ఈ తరంలో కాజల్, తమన్నా..


  Controversial Photoshoots: కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన ఫోటోషూట్స్ ఇవే..


  Balakrishna Industry Hits: మంగమ్మ గారి మనవడు టూ నరసింహనాయుడు వరకు ఇండస్ట్రీ హిట్ సాధించిన బాలకృష్ణ సినిమాలు ఇవే..

  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Bollywood news, Deepika Padukone, Fighter, Hrithik Roshan, Siddharth Anand

  ఉత్తమ కథలు