• Home
  • »
  • News
  • »
  • movies
  • »
  • HRITHIK ROSHAN ANOTHER ACHIEVEMENT FOR OSCAR AWARDS COMMITTEE TA

హృతిక్ రోషన్‌కు మరో అరుదైన గౌరవం.. ఆ అవార్డుల కోసం ప్రత్యేకంగా..

హృతిక్ రోషన్ (పైల్ ఫోటో)

హృతిక్ రోషణ్‌కు మరో అరుదైన గౌరవం దక్కింది. ఈయనకు ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయిన ఆస్కార్ అవార్డుల కమిటీ నుంచి ప్రత్యేక ఆహ్వానం అందింది. హృతిక్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులకు ఈ అకాడమీ అవార్డుల కమిటీ నుంచి ప్రత్యేక ఆహ్వానాలు అందాయి. వివరాల్లోకి వెళితే.. 

  • Share this:
    హృతిక్ రోషణ్‌కు మరో అరుదైన గౌరవం దక్కింది. ఈయనకు ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయిన ఆస్కార్ అవార్డుల కమిటీ నుంచి ప్రత్యేక ఆహ్వానం అందింది. హృతిక్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులకు ఈ అకాడమీ అవార్డుల కమిటీ నుంచి ప్రత్యేక ఆహ్వానాలు అందాయి. వివరాల్లోకి వెళితే..  వాల్డ్ వైడ్‌గా ఎక్కువ మంది సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూసే అవార్డు వేడుకల్లో ఆస్కార్ ముందు వరసలో ఉంటుంది. ఇక హాలీవుడ్ నటీనటులకైతే.. జీవితంలో ఒకసారైనా ఆస్కార్ అవార్డు అందుకోవాలని కలలు కంటుంటారు. సినీ ప్రపంచంలోనే అత్యున్నత అవార్డుగా భావించే అకాడమీ అవార్డులను ప్రతి యేడాది ఫిబ్రవరి చివరి వారంలో ఇవ్వడం ఆనవాయితీగా వస్తుంది. ఐతే.. వచ్చే యేడాది 2021లో జరగనున్న ఈ అవార్డు వేడుకలను కరోనా మహామ్మారి కారణంగా రెండు నెలలు పాటు వాయిదా వేశారు. నెక్ట్స్ ఇయర్ ఏప్రిల్ 25న అకాడమీ అవార్డుల ప్రధానోత్సవం జరపబోతున్నట్టు ఆస్కార్ అవార్డుల కమిటీ వెల్లడించింది. 93వ అకాడమీ అవార్డుల ప్రధానోత్సవాన్ని 8 వారాల పాటు వాయిదా వేసారు. ఆస్కార్ వేడుకల చరిత్రలో ఈ వేడుక వాయిదా వేయడం నాల్గోసారి. 1938లో లాస్ ఏంజెల్స్‌లో వరదలు ముంచెత్తినపుడు ఓసారి వాయిదా పడింది. ఆ తర్వాత 1968లో అప్పటి అమెరికా అధ్యక్షుడు మార్టిన్ లూథర్ కింగ్ హత్య జరిగిపుడు రెండు రోజులు, 1981లో అప్పటి అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్ పై హత్య యత్నం జరిగినపుడు ఈ వేడుకలను వాయిదా  వేశారు. గడిచిన 40 ఏళ్లతో ఆస్కార్ వేడుకలు వాయిదా పడడం ఇదే మొదటిసారి.

    oscar 2021 awards event postponed due to coronavirus,ocscar awards,ocscar 93 academy awards,ocscar awards postponed,oscar,gully boy oscars,gully boy oscars entry,hollywood,tollywood,bollywood,balakrishna chiranjeevi, ram charan rrr jr ntr, ఆస్కార్ ఎంట్రీ, 93వ అకాడమీ అవార్డులు,ఆస్కార్ అవార్డులు,93వ ఆస్కార్ అవార్డులు, బరిలో చుక్కెదురు,ఆస్కార్ అవార్డులు వాయిదా,ఆస్కార్ బరి,ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం వాయిదా
    ఆస్కార్ అవార్డ్స్ 2021 వాయిదా (Twitter/Photo)


    ఇక ఆస్కార్ అవార్డులను అందించే అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్  ప్రతి యేట ప్రపంచ వ్యాప్తంగా వివిధ సినీ పరిశ్రమలకు చెందిన ప్రముఖులను అకాడమీలోకి ఆహ్వానించడం ఆనవాయితీగా వస్తోంది. 2020 యేడాదికి కాను అకాడమీ సభ్యుల జాబితాను తాజాగా AMPAS ప్రకటించింది. నెక్ట్స్ ఇయర్ జరగబోయే వేడుకలకు మన దేశం తరుపున హృతిక్ రోషన్‌ను ఆహ్వానించింది. హృతిక్‌తో పాటు.. ఈ వేడుకలకు ఆలియా భట్‌తో పాటు, కాస్ట్యూమ్ డిజైనర్ నీతూ లుల్లా, ప్రియ స్వామినాథన్, మరోవైపు వార్, భారత్ సినిమాలకు గ్రాఫిక్స్ అందించిన వీఎఫ్‌ఎక్స్ ప్రొడ్యూసర్స్ విషాల్ ఆనంద్‌తో పాటు పానిపట్, జల్ తదితర సినిమాలకు గ్రాఫిక్స్ సమకూర్చిన  సందీప్ కమల్ ఈ యేడాది కమిటీ సభ్యులుగా ఉంటారని పేర్కొంది. మొత్తంగా వివిధ క్యాటగిరీల్లో 819 సభ్యులుంటారని పేర్కొంది. గతంలో అమితాబ్ బచ్చన్, ఏఆర్ రహామాన్, ఐశ్వర్యారాయ్ వంటి వారు అకాడమీలో సభ్యులుగా ఉన్నారు.
    First published: