అదిరిపోయిన హృతిక్‌ రోషన్‌, టైగర్‌ ష్రాఫ్‌ వార్ ట్రైలర్..

వార్ మూవీ పోస్టర్ Instagram.com/hrithikroshan

War Telugu trailer talk : హృతిక్‌ రోషన్‌, టైగర్‌ ష్రాఫ్‌ ప్రధాన పాత్రల్లో వస్తున్న భారీ యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘వార్‌’. ఈ సినిమా ట్రైలర్ ఈరోజు విడుదలైంది.

  • Share this:
    War Telugu trailer talk : హృతిక్‌ రోషన్‌, టైగర్‌ ష్రాఫ్‌ ప్రధాన పాత్రల్లో వస్తున్న భారీ యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘వార్‌’. ఈ సినిమా తెలుగు ట్రైలర్‌ను ఈరోజు విడుదల చేసింది చిత్ర బృందం. ఈ సినిమాను సిద్ధార్థ్‌ ఆనంద్‌ డైరెక్ట్ చేశాడు . ఈయన గతంలో హృతిక్‌ రోషన్‌ హీరోగా ‘బ్యాంగ్‌ బ్యాంగ్‌’ అనే యాక్షన్ సినిమాను దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే.  అది అలా ఉంటే.. ఈ రోజు విడుదలైన వార్ ట్రైలర్ ఎంతో ఆసక్తికరంగా ఉంది. దీనికి తోడు యాక్షన్‌ హీరోస్ హృతిక్‌ రోషన్, టైగర్‌ ష్రాఫ్ జంటగా ఒకే సినిమాలో రావడంతో ఈ చిత్రంపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.

    అభిమానుల అంచనాలకు తగ్గట్లుగానే చిత్ర ట్రైలర్ యాక్షన్ సీన్స్‌తో అదరగొడుతోంది. ఈ సినిమాలో అదిరిపోయే కార్‌ ఛేజింగులు, భారీ యాక్షన్ సీన్స్ ప్రేక్షకులను కొత్త అనుభూతిని ఇవ్వనున్నాయంటున్నారు చిత్ర నిర్మాతలు. కాగా ఈ చిత్రంలో హృతిక్, టైగర్‌తో పాటు వాణీ కపూర్‌ మరో కీలక పాత్ర చేస్తోంది. విశాల్ శేఖర్ సంగీతం అందిస్తున్నారు. యశ్‌రాజ్ ఫిలింస్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా.. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్‌ 2న హిందీతో పాటు, తెలుగు, తమిళ భాషల్లో  ప్రపంచ వ్యాప్తంగా విడుదలకానుంది.
    First published: