news18-telugu
Updated: February 21, 2020, 8:33 AM IST
భీష్మ సినిమా పోస్టర్స్ (Bheeshma movie review)
Bheeshma Twitter Review : వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్న హీరో నితిన్ చాలా గ్యాప్ తర్వాత నటించిన సినిమా భీష్మ. శ్రీనివాస కల్యాణం తర్వాత చేస్తున్న ఈ సినిమాపై నితిన్ భారీగానే ఆశలు పెట్టుకున్నాడు. వెంకీ కుడుముల డైరెక్ట్ చేసిన ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. నితిన్‌కు జోడీగా రష్మిక మందన్నా అందాలను ప్రదర్శిస్తోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ మంచి టాక్‌ను సంపాదించుకుంది. సేంద్రియ వ్యవసాయం కాన్సెప్ట్‌తో వస్తోందీ సినిమా. మహా శివరాత్రి సందర్భంగా ఈ రోజు సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. అయితే.. సినిమా ఇప్పటికే విదేశాల్లో విడుదలైంది. ఇప్పటికే యూఎస్‌లో ప్రీమియర్ షోలు రిలీజ్ అయ్యాయి. అక్కడ సినిమా చూసిన వాళ్లు ట్విట్టర్‌లో తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు.
సినిమా సూపర్ హిట్ అని, నితిన్ ఖాతాలో ఎట్టకేలకు విజయం చేరిపోయిందంటూ ట్వీట్లు పెడుతున్నారు. కామెడీ కేక పుట్టించిందని, ఫస్టాఫ్‌లో కామెడీతో ప్రేక్షకులకు కావాల్సినంత ఆనందాన్ని ఇచ్చారని చెబుతున్నారు. ఇంటర్వెల్ ట్విస్ట్, నితిన్ నటన, క్యారెక్టర్ అదిరిపోయిందని పేర్కొంటున్నారు.
సెకండాఫ్‌లో అసలు కథ మొదలై, ఎక్కడా బోర్ కొట్టించకుండా ఆసాంతం కథ రక్తి కట్టించేలా సాగిందని, ఫస్టాఫ్‌లోలాగే కామెడీ కొనసాగిందని పోస్టులు పెడుతున్నారు. సినిమా భారీ వసూళ్లతో దూసుకుపోతుందని స్పష్టం చేస్తున్నారు. కాగా, ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ సినిమాను సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్నాడు. మహతి స్వర సాగర్ సంగీతం ఇస్తున్నాడు.
Published by:
Shravan Kumar Bommakanti
First published:
February 21, 2020, 8:33 AM IST