HOW MUCH MONEY EARNED BY ABIJEET AFTER WINNING THE BIGG BOSS 4 TELUGU TITLE HERE THE DETAILS PK
Bigg Boss 4 Abijeet remuneration: అభిజీత్ బిగ్ బాస్‌లో ఎంత సంపాదించాడు.. లక్షలా కోట్లా..?
చిరంజీవి చేతుల మీదుగా ట్రోఫీ అందుకున్న అభిజీత్ (chiranjeevi abijeet nagarjuna)
Bigg Boss 4 Abijeet remuneration: బిగ్ బాస్ 4 తెలుగు అయిపోయిన తర్వాత కూడా సోషల్ మీడియాలో మాత్రం ట్రెండింగ్ అవుతూనే ఉంది. ఈ సారి ప్యాండమిక్‌లో కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకు సాగించారు నిర్వాహకులు.
బిగ్ బాస్ 4 తెలుగు అయిపోయిన తర్వాత కూడా సోషల్ మీడియాలో మాత్రం ట్రెండింగ్ అవుతూనే ఉంది. ఈ సారి ప్యాండమిక్‌లో కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకు సాగించారు నిర్వాహకులు. పైగా కరోనా సమయంలో కూడా కంగారు పడకుండా వచ్చిన కంటెస్టెంట్స్‌కు భారీగానే పారితోషికం ఇచ్చినట్లు తెలుస్తుంది. గతంతో పోలిస్తే ఈ సారి వచ్చిన వాళ్లు బాగానే సంపాదించుకున్నారు కూడా. ఇప్పటికే లాస్య, అవినాష్ లాంటి వాళ్లకు 40 లక్షల వరకు వచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. మరోవైపు మోనాల్ కూడా దాదాపు 45 లక్షల వరకు బిగ్ బాస్ నుంచి పారితోషికం అందుకుందని తెలుస్తుంది. అంతెందుకు సోహెల్ కూడా పాతిక లక్షల ప్రైజ్ మనీతో పాటు నాగార్జున ఇచ్చిన 10 లక్షలు.. దాంతో పాటు బిగ్ బాస్ ఇంట్లో 15 వారాలు ఉన్నందుకు వారానికి 2 లక్షల చొప్పిన మరో 30 లక్షలు.. అలా 60 లక్షల వరకు గెలిచినట్లు తెలుస్తుంది. మరి వీళ్ల పరిస్థితే ఇలా ఉంటే బిగ్ బాస్ విన్నర్.. క్రేజ్ కా బాప్ అనిపించుకున్న అభిజీత్ ఎంత గెలిచాడు అనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు ఈయన ప్రైజ్ మనీ గురించి అంతా మాట్లాడుకుంటున్నారు.
అభిజీాత్ (Abijeet/Twitter)
విన్నర్‌కు 50 లక్షలతో పాటు షోలో పాల్గొన్నందుకు డబ్బులు వస్తాయి. అయితే ఈ సారి సోహెల్ మూడో స్థానంలో ఉండటానికి 25 లక్షలు తీసుకోవడంతో విన్నర్‌కు 25 లక్షలు మాత్రమే వచ్చాయి. అయితే విజేతగా నిలిచినందుకు వచ్చిన డబ్బుల కంటే కూడా ఇంట్లో 106 రోజులు ఉన్నందుకు వచ్చింది అభిజీత్‌కు ఎక్కువగా ఉంది. నిజానికి ఆయన ఆర్థిక స్థోమతతో పోలిస్తే 50 లక్షలు లెక్క కాకపోవచ్చు కానీ గుర్తింపు మాత్రం వచ్చింది. బిగ్ బాస్‌లోకి వచ్చే ముందే వారానికి దాదాపు 5 లక్షల వరకు ప్యాకేజ్ మాట్లాడుకున్నాడు అభిజీత్. ఈ లెక్కన 15 వారాలు అంటే 75 లక్షలు అన్నమాట.
అభిజీాత్ (Abijeet/Twitter)
దాంతో పాటు ప్రైజ్ మనీ 25.. మొత్తం కలిపిపే కోటి రూపాయల వరకు అభిజీత్ గెలుచుకున్నట్లు తెలుస్తుంది. ఒకవేళ ఫుల్ ప్రైజ్ మనీ వచ్చుంటే కోటి 25 లక్షల వరకు అభి గెలిచేవాడు. కానీ ఏం చేస్తాం బిగ్ బాస్ ఇచ్చిన ట్విస్టుతో పాతిక లక్షలు లాస్ అన్నమాట. ఏదేమైనా కూడా 8 ఏళ్ల కింద 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్'లో నటించిన తర్వాత కూడా ఈయన కెరీర్ బ్యూటీఫుల్ కాలేదు. మరి ఇప్పుడు బిగ్ బాస్ టైటిల్ గెలిచిన తర్వాత అయినా లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ అవుతుందని భావిస్తున్నాడు అభిజీత్. ఇప్పటికే మనోడికి ఆఫర్స్ మాత్రం బాగానే వస్తున్నాయని ప్రచారం జరుగుతుంది.
Published by:Praveen Kumar Vadla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.