ఈ ఫోటోలో కనిపిస్తున్న చిన్నారిని గుర్తు పట్టారా..? ఈమె ప్రస్తుతం భౌతికంగా మన మధ్య లేరు.. కానీ ఆమె నటించిన సినిమాలు.. పోషించిన పాత్రలు.. ఆమె క్రేజ్ మాత్రం అలాగే ఉండిపోయాయి. చనిపోయి చాలా ఏళ్ళవుతున్నా కూడా ఇంకా ఆమెకు అభిమానులు అలాగే ఉండిపోయారు. ఆమె లాంటి నటి మరొకరు రారు.. ఇంక లేరు అంటూ మన్ననలు అందుకుంటున్నారు ఈ నటి. అభినవ సావిత్రిగా అందరితో ప్రశంసల వర్షం కురిపించుకున్న ఈ అమ్మాయి ఎవరో గుర్తుకొచ్చిందా.. యస్.. మీరు ఊహించిన పేరే.. సౌందర్య.
చిన్ననాడే ఆమె హీరోయిన్ అవుతుందని.. పెద్ద స్టార్ అవుతుందని ఆమె నాన్న గ్రహించారు. సౌందర్య తండ్రి నిర్మాతే కాదు.. జ్యోతిష్కుడు కూడా. పెళ్లి తర్వాత ఆమె జీవితంలో పెద్ద ప్రమాదం ఒకటి జరుగుతుందని ముందే ఊహించాడని కన్నడనాట చెప్తుంటారు. అలాంటిదే నిజమైంది.. సౌందర్య మనకు దూరమైంది. ఇదిలా ఉంటే 20 ఏళ్ల కంటే ముందే ఇండస్ట్రీకి వచ్చిన సౌందర్య.. తక్కువ వయసులోనే ఎక్కువ పేరు సంపాదించుకుంది. మనవరాలి పెళ్లి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సౌందర్య.. ఆ తర్వాత అమ్మోరు, పెదరాయుడు లాంటి ఎన్నో సినిమాలతో స్టార్ హీరోయిన్ అయిపోయింది.
లేడీ ఓరియెంటెడ్ సినిమాలే కాదు హీరోల పక్కన రొమాన్స్ చేయడంలోనూ ఈమె దిట్ట. ముఖ్యంగా ఫ్యామిలీ ప్రేక్షకుల మనసు దోచిన హీరోయిన్ సౌందర్య. గ్లామర్ రాజ్యమేలుతున్న సమయంలో కూడా అందాల ఆరబోతకు దూరంగా ఉండి నెంబర్ వన్ అయిన ముద్దుగుమ్మ సౌందర్య. నేటి సావిత్రిగా అందరి మన్ననలు అందుకున్న ఈమె.. ఎప్రిల్ 17, 2004న హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.