జబర్దస్త్ టార్గెట్‌గా అదిరింది షో... ఇప్పుడే మొదలైందంటున్న నాగబాబు...

జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షోకి పోటీగా వచ్చిన అదిరింది షో ఫస్ట్ ఎపిసోడ్ దుమ్ము రేపిందా? కామెడీ పండిందా?

news18-telugu
Updated: December 24, 2019, 9:39 AM IST
జబర్దస్త్ టార్గెట్‌గా అదిరింది షో... ఇప్పుడే మొదలైందంటున్న నాగబాబు...
అదిరింది (credit - YT- Zee Telugu)
  • Share this:
జబర్దస్త్, ఎక్స్‌ట్రా జబర్దస్త్ కామెడీ షోలకు ఆరేళ్లుగా జడ్జిగా వ్యవహరించి... ఆ షోల నుంచీ బయటకు వచ్చిన మెగా బ్రదర్ నాగబాబు... జీ తెలుగు ద్వారా అదిరింది షోను గట్టెక్కించడానికి గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. ఐతే... ఈ షో జబర్దస్త్‌కి జిరాక్స్ కాపీలా ఉందనే విమర్శలు వస్తున్నా... సీనియర్ కమెడియన్లను రంగంలోకి దింపి... జబర్దస్త్‌కి పోటీ ఇస్తున్నారు నాగబాబు. కొంత కామెడీ, కొన్ని పంచ్‌లు, జబర్దస్త్‌, మల్లెమాలపై చాలా సెటైర్లతో సాగింది ఆదివారం రాత్రి వచ్చిన తొలి షో. ముఖ్యంగా జబర్దస్త్ టార్గెట్‌గా నాగబాబుతోపాటూ... టీమ్ లీడర్లు కూడా సెటైరికల్ పంచులు వేశారు. జబర్దస్త్‌పై తమకున్న పర్సనల్ ఫీలింగ్స్ అన్నింటినీ ఈ షోలో చూపించారనుకోవచ్చు.

అదిరింది అన్న పేరు బాగానే ఉన్నా... ఈ షోకి వేసిన సెట్టింగ్, మాంటేజ్, టీమ్ లీడర్ల ఎంట్రీ ఇలా ఏదీ కూడా ఆసక్తిగా లేదంటున్నారు నెటిజన్లు. ప్రధానంగా... తొలి ఎపిసోడ్ అనగానే ఓ రేంజ్‌లో ఉంటుందని అంచనా వేసుకుంటే... ఆ స్థాయిలో లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సీనియర్ కమెడియన్లను పెట్టారు కాబట్టి... కనీసం ఆ మాత్రమైనా చూడగలిగేలా ఉందంటున్నారు మరికొందరు. ఓ సినిమా లాంటి సినిమాను మరో దర్శకుడు తీస్తే... తిట్టిపోస్తారు జనం. అలాంటప్పుడు ఓ కామెడీ షో లాంటి మరో షోను ప్రారంభించడమేంటని విమర్శిస్తున్నారు మరికొందరు. దేని లెక్క దానిదే అనుకుందామన్నా... నాగబాబు వ్యక్తిగత దురుద్దేశాలతో ఈ షోని ప్రారంభించారన్న విమర్శలొస్తున్నాయి.

అదిరింది ప్రారంభించాక... కొంత మంది సీనియర్ కమెడియన్లు జబర్దస్త్‌ను వీడిపోయారు. ఫలితంగా అటు జబర్దస్త్‌లో కొంత కామెడీ క్వాలిటీ తగ్గగా... ఇటు అదిరింది షో అంతంత మాత్రంగా ఉండటంపై చర్చ మొదలైంది. ఐతే... మల్లెమాలపై విమర్శలు చేస్తూ... సెటైర్లు వేస్తూ స్కిట్లు చెయ్యడం మానేసి... స్వతహాగా చెయ్యాలని కోరుతున్నారు నెటిజన్లు. ఇలా పర్సనల్ ఫీలింగ్స్‌ని షోలలో చూపించడం కరెక్టు కాదనే వాదన వినిపిస్తోంది.
Published by: Krishna Kumar N
First published: December 24, 2019, 9:39 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading