టాలీవుడ్ అగ్రహీరోతో విబేధాలు... ఇలియానకు దూరమైన అవకాశాలు

ఆమె తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నటుడిని పట్టించుకోలేదన్న విమర్శలు మాత్రం ఎదుర్కొంది. వాటి ఫలితమే ఇలియాన బాలీవుడ్ వైపు వెళ్లాల్సి వచ్చిందని వార్తలు వినిపిస్తున్నాయి.

news18-telugu
Updated: December 14, 2019, 10:04 AM IST
టాలీవుడ్ అగ్రహీరోతో విబేధాలు... ఇలియానకు దూరమైన అవకాశాలు
ఇలియాన
  • Share this:
ఇలియాన.. దేవదాస్ సినిమతో రామ్ పోతినేని పక్కన మెరిసింది ఈ ముద్దుగుమ్మ. మొదటి సినిమాతో అందాల ఆరబోతతో ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసింది. దీంతో ఆ తర్వాత పెద్దగా సినిమా అవకాశాల కోసం కష్టపడాల్సిన అవసరం లేకుండా పోయింది. వరుసగా టాలీవుడ్ స్టార్ హీరోల పక్కన ఛాన్స్ కొట్టేసింది. పోకిరి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఆతర్వాత ఆమె నటించిన ఎన్నో సినిమాలు బాక్స్ ఆఫీస్‌ను షేక్ చేశాయి. టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఎదుగుతున్న సమయంలో ఇలియాన ఓ అగ్రహీరోతో చేసిన సినిమా ఆమెకు లేనిపోని తలనొప్పులు తెచ్చిపెడ్డింది ఆ తర్వాత మాత్రం ఇలియాన.. టాలీవుడ్‌లో అవకాశాలు కోల్పోయింది. బాలీవుడ్ వైపు చూసింది. అడపా దడపా సినిమాలు చేసింది కాబట్టే అక్కడ సుస్థిర స్థానం సంపాదించుకోలేకపోయింది.

ఇంతకీ ఆ సినిమా ఏమనుకుంటున్నారా? శక్తి. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా, ఇలియాన హీరోయిన్‌గా 2011 ఏప్పిల్ 1న ఈ సినిమా విడుదలైంది. అయితే సినిమా పెద్దగా ఆడలేదు. ప్లాప్ అన్న టాక్ సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో ఇలియాన వ్యవహారం జూనియర్ ఎన్టీఆర్‌కు నచ్చలేదన్న వార్తలు ఇప్పుడు తాజాగా తెరపైకి వచ్చాయి. సీన్ ల చిత్రీకరణ సమయంలోనే హీరోయిన్ కార్వాన్ వెహికల్ నుంచి బయటకు రావడం.. మిగతా సమయం అంతా అందులోనే ఉండటం అనేక విమర్శలకు దారితీసింది. మూవీ టీమ్‌తో  ఆమె ఏ మాత్రం కలిసేది కాదని అంతా మట్లాడుకున్నారు. అంతేకాదు ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్‌లో కూడా ఇలియాన ఎక్కడ పాల్గొనలేదు. అయితే శక్తి సినిమాపై ఇంటర్వ్యూ ఇచ్చిన సమయంలో ఇలియాన.. తనకు చెప్పిన కథ ఒకటని... తీసిన కథ మరొకటి ఆరోపణలు చేసింది. కథలు మార్పులు చేశారని విమర్శించింది. అయితే ఈ సినిమా కన్నా నేను నా రాక్షసి  సినిమా బాగా ఆడుతుందని చెప్పుకొచ్చింది.


ఇలియాన చేసిన వ్యాఖ్యల ప్రతిఫలమో ఏమా కానీ. జూనియర్ ఎన్టీఆర్ శక్తి సిినిమా తర్వాత ఇలియాన టాలీవుడ్‌లో ఎక్కడా అవకాశాలు రాలేదు. ఈ చిత్రం తరువాత, ఇలియానా ఇంతకుముందు సంతకం చేసిన చిత్రాలను పూర్తి చేసింది. ఆ తర్వాత ఆమెకు ఎటువంటి ఆఫర్లు రాలేదు. అయితే క్తి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ మరియు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ మేకర్స్ అధికారికంగా ఎలాంటి ఫిర్యాదులు చేయలేదు. కానీ ఆమె తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నటుడిని పట్టించుకోలేదన్న విమర్శలు మాత్రం ఎదుర్కొంది. వాటి ఫలితమే ఇలియాన బాలీవుడ్ వైపు వెళ్లాల్సి వచ్చిందని వార్తలు వినిపిస్తున్నాయి. 
First published: December 14, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>