ఓ రేపిస్ట్‌కు అవకాశం ఎలా ఇస్తారు..బాలీవుడ్ అగ్ర హీరోను హెచ్చరిస్తోన్న బాలక‌ృష్ణ భామ

తనుశ్రీ దత్తా..తెలుగులో బాలక‌ృష్ణ సరసన వీరభద్ర అనే సినిమాలో చేసిన సంగతీ తెలిసిందే. తను శ్రీ ఇండియాలో మొదలైన మీటూ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించారు. తాజాగా ఆమె మరోసారి రేపిస్ట్‌గా ముద్రపడ్డ ఓ హిందీ నటుడుకు అవకాశం ఎలా ఇస్తారంటూ.. అజయ్ దేవగన్‌పై విరుచుకుపడుతోంది.

news18-telugu
Updated: April 18, 2019, 11:04 AM IST
ఓ రేపిస్ట్‌కు అవకాశం ఎలా ఇస్తారు..బాలీవుడ్ అగ్ర హీరోను హెచ్చరిస్తోన్న బాలక‌ృష్ణ భామ
తనుశ్రీ దత్తా..Photo:nstagram.com/iamtanushreeduttaofficial/
news18-telugu
Updated: April 18, 2019, 11:04 AM IST
తనుశ్రీ దత్తా..తెలుగులో బాలక‌ృష్ణ సరసన వీరభద్ర అనే సినిమాలో చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆమె తెలుగులో సినిమాలు చేయలేదు. అయితే హిందీలో మాత్రం సినిమాలు భాగానే చేసింది. సినిమాలు చేసిన సమయంలో నటుడు నానా పటేకర్..తనను లైంగికంగా వేధించాడని..ఆరోపించిన సంగతీ తెలిసిందే. తనుశ్రీ దత్తా చేసిన ఈ వ్యాఖ్యలతోనే బాలీవుడ్‌లో మీటూ ఉద్యమం మొదలైంది. ఈ ఊపులో చాలా మంది నటీ మనులు..తమకు జరిగిన,ఎదురైన వేధింపులని వివరిస్తూ..వివిధ వేధికల ద్వారా తెలియజేశారు. ఈ ఉద్యమంలో.. ప్రముఖులుగా భావించే దర్శకులు, నిర్మాతలు, నటుల పేర్లు కూడా బయటకు వచ్చాయి. దీంతో చాలా మంది దర్శకులు, నటులు వారు చేస్తోన్న సినిమాలను కోల్పోవలసి వచ్చింది. వారిలో అలోక్ నాథ్ పేరు ప్రముఖంగా వినపడింది. తనను రేప్ చేశాడంటూ..అంతేకాకుండా మానసికంగా వ్యదకు గురిచేశాడని..ప్రముఖ నటి, రచయిత వింటా నందా..ఆరోపణలు చేసింది. దీంతో అలోక్ నాథ్ చేస్తోన్న చాలా సినిమాల నుండి అతన్ని తొలగించారు. ఆ తర్వాత మీటూ ఉద్యమం కొంత సద్దుమణిగింది.

తనుశ్రీ దత్తా..Photo:nstagram.com/iamtanushreeduttaofficial/
తనుశ్రీ దత్తా..Photo:Instagram.com/iamtanushreeduttaofficial/


అయితే తాజాగా మరోసారి.. తనుశ్రీ దత్తా తన వ్యాఖ్యలతో సంచలనం స‌ృష్టిస్తోంది. ప్రస్తుతం.. అలోక్ నాథ్, 'దే దే ప్యార్ దే' అనే హిందీ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో అజయ్ దేవగన్ హీరోగా చేస్తున్నాడు. దీంతో..తనుశ్రీ మాట్లాడుతూ.. ఒక రేపిస్ట్‌కు అవకాశం ఇవ్వడం ఏంటని.. దేవగన్ పై విరుచుకుపడ్డారు. ఆమె మాట్లాడుతూ.. హిందీ సినిమాల్లో అందరూ అబద్దాలు చెబుతారని.. దీనికి తాజా ఉదాహరణ అజయ్ దేవగన్ అంటోంది. నటుడు అలోక్ నాథ్ పై ఓ మహిళ..తనను రేప్ చేశాడని ఆరోపణలు చేసిన విషయం తెలిసి కూడా.. అతడికి అజయ్ దేవగన్ ఎందుకు అవకాశం ఇచ్చారని.. తనుశ్రీ దత్తా ప్రశ్నిస్తోంది. అతడిని వెంటనే మీ చిత్రం నుంచి తొలగించి మరో నటుడిని తీసుకోవాలనీ తనుశ్రీ దత్తా అజయ్ దేవగన్‌‌కు సూచనలు చేస్తోంది. ఒక వేళా..మీరు అలా చేయకుంటే తప్పుని ప్రోత్సహించే వ్యక్తిగా మిమ్మల్ని భావించాల్సి ఉంటుందని అజయ్ దేవగన్‌ను...హెచ్చరించింది. 'దే దే ప్యార్ దే' చిత్రం ట్రైలర్ ఇప్పటికే రీలీజై..మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. మే 17న విడుదలకు సిద్ధం అవుతోన్న ఈ చిత్రంలో అజయ్ దేవగన్ సరసన టబు, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. First published: April 17, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...