సుమ నెంబర్ వన్.. ఆమె లాస్ట్.. యాంకర్ వర్షిణి సంచలన ఇంటర్వ్యూ..

Varshini Sounderajan: తెలుగు బుల్లితెరపై నెంబర్ వన్ యాంకర్ ఎవరు అంటే చిన్న పిల్లాడిని అడిగినా కూడా తడుముకోకుండా చెప్పే పేరు సుమ కనకాల. ఎందుకంటే ఆరు నుంచి అరవై..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: July 13, 2020, 6:58 PM IST
సుమ నెంబర్ వన్.. ఆమె లాస్ట్.. యాంకర్ వర్షిణి సంచలన ఇంటర్వ్యూ..
యాంకర్ వర్షిణి ఫోటోస్ (anchor varshini/Twitter)
  • Share this:
తెలుగు బుల్లితెరపై నెంబర్ వన్ యాంకర్ ఎవరు అంటే చిన్న పిల్లాడిని అడిగినా కూడా తడుముకోకుండా చెప్పే పేరు సుమ కనకాల. ఎందుకంటే ఆరు నుంచి అరవై వరకు అంత ఫాలోయింగ్ ఉంది ఈమెకు. ఇప్పుడు మరో యాంకర్ వర్షిణి కూడా ఇదే చెప్పింది. ఢీ షోతో బాగా పాపులర్ అయ్యింది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత హైపర్ ఆదితో కలిసి ఈ మధ్య బాగానే రొమాన్స్ చేస్తూ రచ్చ చేస్తుంది. దాంతో బాగానే ఫేమ్ కూడా సంపాదించుకుంటుంది వర్షిణి. దానికితోడు అందాల ఆరబోతలో కూడా అమ్మడు కోటలు దాటేస్తుంది.
యాంకర్ వర్షిణి ఫోటోస్ (anchor varshini/Twitter)
యాంకర్ వర్షిణి ఫోటోస్ (anchor varshini/Twitter)


రష్మి, అనసూయకు ఏ మాత్రం తీసిపోని విధంగా వర్షిణి కూడా అందాలను ఆరబోస్తుంది. ఢీ తో పాటు అవకాశం వచ్చినప్పుడల్లా భారీగానే అందాలను ఆరబోస్తూ ఔరా అనిపిస్తుంది వర్షిణి. ఈ మధ్యే ఓ యూ ట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమ్మడు చాలా ప్రశ్నలకు ఆసక్తికరమైన సమాధానాలు ఇచ్చింది. అందులో ముఖ్యంగా యాంకర్ విష్ణు ప్రియతో ఈమె గొడవ గురించి క్లారిటీ ఇచ్చింది.
హైపర్ ఆది, వర్షిణి (Youtube)

తన కో యాంకర్ విష్ణుప్రియతో వర్షిణికి గొడవలున్నాయంటూ చాలా రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే దీనిపై ఎప్పడూ ఈమె స్పందించింది కూడా లేదు. ఇప్పుడు సమయం వచ్చింది కాబట్టి ఓపెన్ అయిపోయింది వర్షిణి. తమ మధ్య అలాంటి గొడవలేమి లేవని చెప్పింది వర్షిణి. విష్ణుతో తనకు అసలు ఎలాంటి గొడవలు లేవని.. ఇలాంటి వార్తలు ఎలా పుట్టిస్తారో తనకు తెలియదని చెప్పింది వర్షిణి.
యాంకర్ వర్షిణి ఫోటోస్ (anchor varshini/Twitter)
యాంకర్ వర్షిణి ఫోటోస్ (anchor varshini/Twitter)

ఈ క్రమంలోనే యాంకర్స్‌కు రేటింగ్స్ ఇవ్వమంటే మొదటి స్థానంలో సుమ.. రెండో స్థానంలో ఝాన్సీ.. ఆ తర్వాత శ్రీముఖి, రష్మి, అనసూయ పేర్లని చెప్పింది వర్షిణి. ఇక ఆరో స్థానం తనదని చెప్పిన వర్షిణి.. చివరి స్థానం మాత్రం విష్ణుప్రియకు ఇచ్చింది వర్షిణి. విష్ణుప్రియతో తనకు ఎలాంటి వివాదాలు లేవని చెప్తూనే మరోవైపు ఈమెకు చివరి స్థానం ఇచ్చింది వర్షిణి. పటాస్ నుంచి పాపులర్ అయిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత ఢీతో క్రేజ్ సంపాదించుకుంది.
Published by: Praveen Kumar Vadla
First published: July 13, 2020, 6:58 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading