BIgg Boss 5 Telugu Wild Card Entry: బుల్లితెరపై రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5 తెలుగు ప్రారంభమై వారం అవుతున్న సంగతి తెలిసిందే. ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న బుల్లితెర ప్రేక్షకుల కోరిక నెరవేరింది. ఇప్పటికే నాలుగు సీజన్ లు పూర్తవగా ఇటీవలే సీజన్ 5 ప్రారంభమైంది. ఈసారి ఈ సీజన్ లో మొత్తం19 మంది కంటెస్టెంట్ లు పాల్గొన్నారు. గత సీజన్ ల కంటే ఈ సీజన్ మరింత కొత్తదనంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అంతేకాకుండా మరికొన్ని రోజులతో ఈ సీజన్ సాగనుంది. ఇదిలా ఉంటే తాజాగా ఇందులో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వనున్న కంటెస్టెంట్ పేరు ప్రస్తుతం వైరల్ గా మారింది.
ఈ సీజన్ ప్రారంభమైన మొదటి రోజు నుంచే మంచి సందడిగా కనిపించింది. మొత్తానికి కంటెస్టెంట్ లు తమ తమ పరిచయాన్ని పెంచుకున్నారు. ఇక హౌస్ లో ఎవరి పనిలో వాళ్ళు లీనం అవుతూ గేమ్ లో బాగా పాల్గొంటున్నారు. రెండవ రోజే ఎలిమినేషన్ రౌండ్ కూడా పూర్తయింది. దీంతో ఎలిమినేట్ లిస్టులో యాంకర్ రవి, ఆర్ జై కాజల్, జశ్వంత్, హమీద, మానస్, సరయు ఉండగా ఇందులో నుంచి బయటికి వెళ్లే కంటెస్టెంట్ లు ఎవరా అని సోషల్ మీడియాలో తెగ ప్రశ్నలు ఎదురవుతున్నాయి.
ఇది కూడా చదవండి:మొదటి ఎలిమినేషన్‌లో బయటికి రాబోతున్న కంటెస్టెంట్ ఎవరంటే?
ఇక ప్రతి సీజన్ లాగే ఈ సీజన్ లో కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉండగా.. ఈ సీజన్ లో ఎంట్రీ అయ్యే కంటెస్టెంట్ పేరు కాస్త వైరల్ గా మారింది. ప్రతి సీజన్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ నాలుగో వారంలో ఉండగా ఈ సీజన్ లో రెండవ వారంలోనే ఎంట్రీ ఉంటుందని తెలిసింది. ఇందులో బుల్లితెర యాంకర్ హాట్ బ్యూటీ వర్షిణి ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. యాంకర్ గా బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చిన వర్షిణి.. పలు షో లలో కూడా పాల్గొని బాగా సందడి చేస్తుంది.
ఇది కూడా చదవండి:అనీ మాస్టర్ కాళ్లు పట్టుకున్న జెస్సీ.. నోటి దూల మాములుగా లేదంటూ ట్రోల్?
ఇక సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా కనిపిస్తుంది. నిత్యం తన హాట్ హాట్ అందాలతో రెచ్చిపోతుంది. సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఒకవేళ వైల్డ్ కార్డ్ ఎంట్రీ తో బిగ్ బాస్ లోకి అడుగు పెడితే మాత్రం తన అందాలతో మరింత రచ్చ చేయనుందని అర్థమవుతుంది. అంతే కాకుండా ఇందులో ఎంట్రీ ఇస్తే మాత్రం మరింత క్రేజ్ సంపాదించుకోవడం గ్యారెంటీ అని చెప్పవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Akkineni nagarjuna, Bigg Boss 5 Telugu, Star Maa, Wild Card Entry