రాజమౌళి భార్యకు ముద్దు పెట్టిన హాట్ బ్యూటీ కాజల్ అగర్వాల్..

అవును.. కాస్త కొత్తగా అనిపించినా కూడా ఇదే జరిగిందిప్పుడు. అదేంటి రాజమౌళి భార్యకు కాజల్ ముద్దు పెట్టడం ఏంటి మరీ చిత్రం కాకపోతేనూ అనుకుంటున్నారా..? తాజాగా ఇలాంటి చిత్రమే జరిగింది మరి.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: December 13, 2019, 8:22 PM IST
రాజమౌళి భార్యకు ముద్దు పెట్టిన హాట్ బ్యూటీ కాజల్ అగర్వాల్..
కాజల్ అగర్వాల్ రమా రాజమౌళి
  • Share this:
అవును.. కాస్త కొత్తగా అనిపించినా కూడా ఇదే జరిగిందిప్పుడు. అదేంటి రాజమౌళి భార్యకు కాజల్ ముద్దు పెట్టడం ఏంటి మరీ చిత్రం కాకపోతేనూ అనుకుంటున్నారా..? తాజాగా ఇలాంటి చిత్రమే జరిగింది మరి. పైగా ఈ చిత్రాన్ని స్వయంగా కాజలే తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం గమనార్హం. ప్రస్తుతం ఈ ఫోటో కూడా బాగానే వైరల్ అవుతుంది. ప్రస్తుతం కాజల్ వరస సినిమాలతో బిజీగా ఉంది. ఈమె తన సినిమాలతో పాటు బయట ఈవెంట్స్‌తో కూడా బాగానే బిజీగా ఉంది ఈ మధ్య. ఇప్పుడు కూడా ఓ సిటీకి వెళ్తుంటే ఫ్లైట్‌లో అనుకోని అతిథి పక్కనే కూర్చుంది. ఆమె మరెవరో కాదు రాజమౌళి భార్య రమా రాజమౌళి.ఈమెను చూసిన కాజల్ ఒక్కసారిగా ఎగిరి గంతేసినంత పని చేసింది. వెంటనే పక్కకి వెళ్లి కూర్చుని ఆమెను గట్టిగా కౌగిలించుకోవడమే కాకుండా ముద్దు కూడా పెట్టేసింది. తనను రియల్ లైఫ్‌లో బాగా ఇన్‌స్పైర్ చేసిన కారెక్టర్స్‌లో రమా మేడమ్ కూడా ఒకరు అంటూ ఆమెను హత్తుకుంది కాజల్. అలాంటి గ్రేట్ పర్సన్ తను వచ్చే విమానంలోనే పక్కనే ఉండటాన్ని చూసి ఆనందాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయింది కాజల్. అందుకే వెంటనే ఆ సంతోషాన్ని ముద్దుల రూపంలో చూపించేసింది. ఈ ఇద్దరి ప్రేమ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఏరులై పారుతుంది. ఇక సినిమాల విషయానికి వస్తే కాజల్ ప్రస్తుతం భారతీయుడు 2తో పాటు మరికొన్ని సినిమాలకు కూడా కమిటైంది.

First published: December 13, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>