నేను చాలా మందితో డేటింగ్ చేశా.. గోవా బ్యూటీ ఇలియానా..

ఇలియానా (Instagram/ileana_official)

తాజాగా ది లవ్ లాఫ్ లైవ్ షో కార్యక్రమంలో పాల్గొన్న ఇలియానా తన వ్యక్తిగత, ప్రొఫెషనల్ జీవితంలోని కొన్ని ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టింది. hot beauty ileana comments on her personal life in a live show

 • Share this:
  ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన గోవా బ్యూటీ ఇలియానా.. ప్రస్తుతం బాలీవుడ్‌లో ఎక్కువగా సినిమాలు చేస్తోంది. కిందటేడాది రవితేజ హీరోగా  ‘అమర్ అక్బర్ ఆంటోని’ సినిమాతో తెలుగులో రీఎంట్రీ ఇచ్చినా కలిసిరాలేదు. ప్రస్తుతం ఆమె ‘పాగల్‌పంతి’ అనే బాలీవుడ్ సినిమాలో నటిస్తోంది. నిన్నటి మొన్నటి వరకు విదేశీ ఫొటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్‌తో చాలా కాలంపాటు డేటింగ్ చేసిన ఇలియానా.. ఇటీవల అతనికి బ్రేకప్ చెప్పేసింది. తాజాగా ‘ది లవ్ లాఫ్’ లైవ్ షో కార్యక్రమంలో పాల్గొన్న ఇలియానా తన వ్యక్తిగత, ప్రొఫెషనల్ జీవితంలోని కొన్ని ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టింది. ఈ షోలో అడిగిన ప్రశ్నలకు ఇలియానా చెప్పిన సమాధానాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి ..

  (Image: Ileana D'Cruz/ Facebook)


  ‘‘శృంగారానికి ప్రేమతో సంబంధం లేదు’’ అని గతంలో ఇలియానా అన్నట్టు వచ్చిన వార్తల గురించి ఈ షో యాంకర్ శిబాని ప్రస్తావించగా.. ఇద్దరి మధ్య కాస్త ఎమోషన్స్ అంటూ ఉంటూనే సెక్స్‌ను ఎంజాయ్ చేయగలమని ఇల్లీ చెప్పింది. అసలు తాను గతంలో చెప్పిన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని వివరణ ఇచ్చింది. అలానే.. నాకు పూలు అంటే చాలా ఇష్టం. నేను చాలా మందితో డేటింగ్ చేశాను. కానీ ఎవరి నుంచి పుష్ఫగుచ్చాలు పొందలేదు. నా బాయ్‌ఫ్రెండ్ ఎవరు కూడా నాకు అలాంటి గిఫ్టులు ఇవ్వలేదు. నాకు గుర్తున్న వరకు నా తండ్రి నుంచి పూలతో కూడిన ఓ గిఫ్టును మాత్రమే అందుకొన్నాను. అంతకుమించి మరొకరు నాకు గిఫ్టులు అందించలేదు అని ఇలియానా తెలిపింది.
  Published by:Kiran Kumar Thanjavur
  First published: