Home /News /movies /

HOT ANCHORS SREEMUKHI AND VISHNU PRIYA MAKING FUN WITH JABARDASTH COMEDIAN MUKKU AVINASH PK

జబర్దస్త్ కమెడియన్‌తో ఆడుకున్న యాంకర్స్ శ్రీముఖి, విష్ణుప్రియ..

యాంకర్స్ శ్రీముఖి విష్ణు ప్రియ (anchors sreemukhi vishnu priya)

యాంకర్స్ శ్రీముఖి విష్ణు ప్రియ (anchors sreemukhi vishnu priya)

Anchor Sreemukhi: బిగ్ బాస్ అయిపోయిన తర్వాత శ్రీముఖి చాలా బిజీ అయిపోయింది. ఆమె రేంజ్ కూడా భారీగానే పెరిగిపోయింది. కొన్ని రోజుల వరకు ఫ్రీగా ఉన్నా కూడా ఆ తర్వాత మాత్రం మళ్లీ వరస షోలు చేసుకుంటూ బిజీ అయిపోయింది..

బిగ్ బాస్ అయిపోయిన తర్వాత శ్రీముఖి చాలా బిజీ అయిపోయింది. ఆమె రేంజ్ కూడా భారీగానే పెరిగిపోయింది. కొన్ని రోజుల వరకు ఫ్రీగా ఉన్నా కూడా ఆ తర్వాత మాత్రం మళ్లీ వరస షోలు చేసుకుంటూ బిజీ అయిపోయింది శ్రీముఖి. అంత బిజీగా ఉన్నా కూడా పార్టీలకు మాత్రం ఈ భామ పక్కా టైమ్ ఇస్తుంది. ఎప్పటికప్పుడు తన కుటుంబంతో పాటు స్నేహితులతో ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. బిగ్ బాస్ తర్వాత మాల్దీవ్స్ వెళ్లి తమ్ముడు, స్నేహితులతో ఫుల్లుగా కుమ్మేసింది యాంకర్. కోటి రూపాయలతో కావాల్సినంత మజా చేస్తుంది ఈ బ్యూటీ. ఇక ఇప్పుడు షోలు చేసుకుంటూనే తన జబర్దస్త్ ఫ్రెండ్స్‌తో కలిసి అల్లరి చేస్తుంది ఈ ముద్దుగుమ్మ.
యాంకర్స్ శ్రీముఖి విష్ణు ప్రియ (anchors sreemukhi vishnu priya)
యాంకర్స్ శ్రీముఖి విష్ణు ప్రియ (anchors sreemukhi vishnu priya)

తాజాగా జబర్దస్త్ కమెడియన్ ముక్కు అవినాష్, మరో యాంకర్ విష్ణు ప్రియతో కలిసి కావాల్సినంత లొల్లి చేసింది శ్రీముఖి. ఈ వీడియో ఇప్పుడు టిక్ టాక్ సహా సోషల్ మీడియాలో బాగానే వైరల్ అవుతుంది. జబర్దస్త్ కమెడియన్స్‌తో ముందు నుంచి కూడా చాలా మంచి అనుబంధం మెయింటేన్ చేస్తుంది శ్రీముఖి. అసలు ముందు ఈ షో తనకే వచ్చిందని.. కానీ అప్పట్లో తనమీద దారుణమైన సెటైర్లు పడతాయని తెలిసి ఒప్పుకోలేదని చెప్పింది శ్రీముఖి. అయినా కూడా సుడిగాలి సుధీర్‌తో ఢీ షో.. మిగిలిన వాళ్లతో కూడా ఏదో ఓ షోలో పార్టిసిపేట్ చేస్తూనే ఉంది ఈ ముద్దుగుమ్మ. అందులో అవినాష్, ఆటో రాంప్రసాద్, సుధీర్ లాంటి వాళ్లు ఈమెకు బాగానే క్లోజ్.
యాంకర్ విష్ణు ప్రియ జబర్దస్త్ అవినాష్ (anchors sreemukhi vishnu priya)
యాంకర్ విష్ణు ప్రియ జబర్దస్త్ అవినాష్ (anchors sreemukhi vishnu priya)

ఇప్పుడు కూడా అవినాష్, విష్ణు ప్రియ ఏదో అల్లరి చేస్తుంటే.. పక్కనే ఉన్న శ్రీముఖి తన నవ్వులతో అందర్నీ నవ్వించింది. ముఖ్యంగా వీడియోలో ఆమె లేకపోయినా కూడా ఆమె నవ్వు మాత్రం బాగా హైలైట్ అయింది. అక్కడున్న అవినాష్, విష్ణు కంటే కూడా శ్రీముఖి పాపులర్ అయింది. యాంకర్ విష్ణు ప్రియ దగ్గర్నుంచి బ్రెడ్డు ముక్క తీసుకుంటూ దానిపై తూతూ అంటూ ఉమ్మేసినట్లు యాక్ట్ చేసాడు అవినాష్. దాంతో విష్ణు పక్కన బెట్టేసింది. ఆ తర్వాత ముక్కు అవినాష్‌కు ఇచ్చే బ్రెడ్డపై కూడా విష్ణు ప్రియ అలాగే చేసినా కూడా అవినాష్ తీసుకుని తినేసాడు. ఇదంతా పక్కనుంచి గమనిస్తున్న శ్రీముఖి గట్టిగా నవ్వేసింది. ప్రస్తుతం ఈ వీడియో బాగానే వైరల్ అవుతుంది. ఏదేమైనా కూడా ఎప్పటికప్పుడు తన జబర్దస్త్ స్నేహితులతో మాత్రం టైమ్ స్పెండ్ చేస్తూనే ఉంటుంది ఈ హాట్ యాంకర్.
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Anchor srimukhi, Anchor vishnupriya, Telugu Cinema, Tollywood

తదుపరి వార్తలు