HONOURABLE GOVERNOR TAMILISAI SOUNDARARAJAN WATCHED MEGASTAR CHIRANJEEVI SYE RAA NARASIMHA REDDY MOVIE IN PRASAD LABS PK
చిరంజీవి ‘సైరా నరసింహా రెడ్డి’ సినిమాను చూసిన తెలంగాణ గవర్నర్..
సైరా సినిమాను కుటుంబంతో పాటు చూసిన గవర్నర్ తమిళిసై
సైరా సినిమాకు ప్రశంసల వర్షం ఆగడం లేదు. తాజాగా ఈ చిత్రాన్ని చిరంజీవి అభ్యర్థన మేరకు తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ చూసారు. హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగిన ప్రత్యేక షోలో..
సైరా సినిమాకు ప్రశంసల వర్షం ఆగడం లేదు. తాజాగా ఈ చిత్రాన్ని చిరంజీవి అభ్యర్థన మేరకు తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ చూసారు. హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగిన ప్రత్యేక షోలో కుటుంబంతో పాటు వచ్చి సైరా నరసింహా రెడ్డి సినిమాను చూసారు తెలంగాణ గవర్నర్. మూడు రోజుల కింద తమ సినిమాను చూడాల్సిందిగా చిరంజీవి ప్రత్యేకంగా ఆమెను ఆహ్వానించాడు. ఇప్పుడు ప్రసాద్ ల్యాబ్‌లో వచ్చి ఈ సినిమాను చూసి తన ఆనందాన్ని వ్యక్తపరిచింది ఈమె. చిరంజీవి నటన అద్భుతంగా ఉందని.. ఇలాంటి సినిమాలు ఇంకా ఇంకా రావాలని ఆమె కోరుకున్నారు.
సైరా సినిమాను కుటుంబంతో పాటు చూసిన గవర్నర్ తమిళిసై
తనను సైరా సినిమాను చూడటానికి ఆహ్వానించిన మెగాస్టార్‌కు కూడా ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఈ వేడుకకు పలువురు రాజకీయ ప్రముఖులు కూడా హాజరయ్యారు. ఇక కలెక్షన్ల విషయానికి వస్తే సైరా తెలుగు రాష్ట్రాల్లో వసూళ్ల వర్షం కురిపిస్తుంది. ఈ చిత్రం వారం రోజుల్లోనే 84 కోట్ల షేర్ వసూలు చేసింది. ఇక ప్రపంచ వ్యాప్తంగా కూడా 110 కోట్ల షేర్ వసూలు చేసింది.
Published by:Praveen Kumar Vadla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.