వీర సింహారెడ్డి (Veera Simha Reddy) సినిమాలో హనీ రోజ్ (Honey Rose) పోషించిన మీనాక్షి (Meenakshi) పాత్ర ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయింది. అందంతో పాటు నటనతో మెప్పించింది మలయాళీ కుట్టి హనీ రోజ్. దీంతో ఒక్కసారిగా నేము, ఫేము కొట్టేసింది ఈ ముద్దుగుమ్మ. ఈ క్రమంలోనే తాజాగా వీర సింహారెడ్డి సక్సెస్ వేడుకలో స్పెషల్ అట్రాక్షన్ అయింది హనీ రోజ్. ఈ సందర్భంగా బాలయ్య బాబుతో కలిసి చిల్ అవుతూ ఎంజాయ్ చేసింది. ఇందుకు సంబంధించిన ఓ పిక్ నెట్టింట వైరల్ అవుతోంది.
వీర సింహారెడ్డి సక్సెస్ ఈవెంట్ ఒకెత్తు అయితే.. సినిమా టీం చేసుకున్న ప్రైవేట్ పార్టీలో హనీ రోజ్ కనిపించిన తీరు మరో ఎత్తు అయింది. బాలయ్యతో కలిసి హనీ రోజ్ చీర్స్ కొట్టేసింది. బాలయ్య, హనీ రోజ్‌లు ఒకరి చేతుల్లో ఒకరి చేతిని దూర్చి మరీ చిల్ అవుతున్న పిక్ నెట్టింట ట్రెండింగ్ గా మారింది. బాలయ్య, హనీల ఈ కలయిక చూసి ఆశ్చర్యపోతున్నారంతా.
వరుసపెట్టి మాస్ యాక్షన్ సినిమాలతో అభిమాన వర్గాల్లో పూనకాలు తెప్పిస్తున్న బాలకృష్ణ.. వీర సింహారెడ్డితో అంతకుమించి హూషారెత్తించారు. తన లోని మాస్ యాంగిల్స్ తో ప్రేక్షకుల చేత గోల పెట్టించారు. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్ము లేపుతోంది. కలెక్షన్స్ పరంగా దూసుకుపోతూ బాలయ్య బాబు కెరీర్ లోనే ది బెస్ట్ సినిమాగా రికార్డులు క్రియేట్ చేస్తోంది.
మైత్రి మూవీ మేకర్స్ (Mythri Movie Makers) బ్యానర్‌పై ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ సినిమాలో బాలయ్య సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది. హానీ రోజ్, వరలక్ష్మీ శరత్ కుమార్, కన్నడ స్టార్ దునియా విజయ్, మలయాళ నటుడు లాల్, నవీన్ చంద్ర, మురళీ శర్మ, ఈశ్వరీ రావు తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. తమన్ బాణీలు సినిమాకు మేజర్ అట్రాక్షన్ అయ్యాయి. ఈ సంక్రాంతి వేళ బాలయ్య గర్జనతో థియేటర్స్ దద్దరిల్లాయి. దీంతో చిత్రయూనిట్ అంతా సంబరాలు చేసుకుంటోంది.
Veera SimhaReddy & Meenakshi Celebrated the Success in Style!! ???????? #NandamuriBalakrishna #HoneyRose #VeeraSimhaReddy #TeluguFilmNagar pic.twitter.com/02qcQGRcTb
— Telugu FilmNagar (@telugufilmnagar) January 23, 2023
ఎంతో ఘనంగా జరిగిన వీర సింహా రెడ్డి సక్సెస్ వేడుకలో పాలరాతి శిల్పంలా మెరిసిపోయింది హనీ రోజ్. తన లేలేత అందాలతో అట్రాక్ట్ చేస్తూ క్యూ స్మైల్ తో మెస్మరైజ్ చేసింది. దీంతో ఈ అమ్మడి ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హనీని ఇలా చూసి పిచ్చెక్కిపోతున్నారు నెటిజన్లు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.