చిరంజీవి చరణ్‌లపై తేనెటీగల దాడి.. స్వల్ప గాయాలు..

మెగాస్టార్‌ చిరంజీవి, రామ్‌చరణ్‌‌లపై తేనెటీగలు దాడి చేశాయి. ఈ దాడిలో చిరు చరణ్‌లతో పాటు పలువురు స్వల్పంగా గాయపడ్డారు.

news18-telugu
Updated: May 31, 2020, 2:11 PM IST
చిరంజీవి చరణ్‌లపై తేనెటీగల దాడి.. స్వల్ప గాయాలు..
కొరటాల శివ ఈ సినిమాను చాలా జాగ్రత్తగా తెరకెక్కిస్తున్నాడు. ఇందులో నక్సలైట్ పాత్రలో చిరు నటిస్తున్నాడని తెలుస్తుంది. మొన్న లీక్ అయిన స్టిల్స్ చూసిన తర్వాత అది నిజమే అని కన్ఫర్మ్ చేసుకుంటున్నారు అభిమానులు. దిలా ఉంటే సినిమాలో రామ్ చరణ్ పాత్ర ఎలా ఉండబోతుందనే దానిపై ఇప్పుడు చర్చ జరుగుతుంది.
  • Share this:
మెగాస్టార్‌ చిరంజీవి, రామ్‌చరణ్‌‌లపై తేనెటీగలు దాడి చేశాయి. ఈ దాడిలో చిరు చరణ్‌లతో పాటు పలువురు స్వల్పంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే.. కామారెడ్డి జిల్లా దోమకొండ సంస్థాన వారసులు, మాజీ ఐఎఎస్‌ అధికారి.. ఉపాసన తాత కామినేని ఉమాపతిరావు అంత్యక్రియలకు మెగా కుటుంబం హాజరైంది. ఉమాపతిరావు భౌతికకాయాన్ని వెలుపలికి తీసుకువస్తుండగా ఒక్కసారిగా తేనెటీగలు దాడి చేశాయి. దాంతో అందరూ చెల్లాచెదురయ్యారు. అయితే వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది చిరంజీవి, రామ్‌చరణ్‌, ఆయన భార్య ఉపాసనను ఆ ప్రమాదం నుంచి తప్పించారు. ఉపాసన తాత కామినేని ఉమాపతిరావు ఈ నెల 27న మృతి చెందారు. ఆయన అంత్యక్రియలను ఇవాళ (మే 31,2020) నిర్వహిస్తున్నారు. ఈ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు కుటుంబసభ్యులతో కలిసి చిరంజీవి ఇవాళ దోమకొండకు వచ్చారు. అయితే అక్కడే ఉన్న మరికొంత మందిని తేనేటీగలు కుట్టడంతో పలువురు స్వల్పంగా గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కొద్ది సేపటి అనంతరం తేనేటీగలు వెళ్లిపోవడంతో అంత్యక్రియలు నిర్వహించారు.
Published by: Suresh Rachamalla
First published: May 31, 2020, 2:03 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading