• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • HOME MINISTER AMIT SHAH IN CHENNAI ACTRESS KASTHURI GIVES CLARITY OVER JOINING BJP

Kasturi Shankar: చెన్నైలో అమిత్ షా...బీజేపీలో చేరికపై క్లారిటీ ఇచ్చిన నటి కస్తూరి

Kasturi Shankar: చెన్నైలో అమిత్ షా...బీజేపీలో చేరికపై క్లారిటీ ఇచ్చిన నటి కస్తూరి

కేంద్ర హోం మంత్రి అమిత్ షా, సినీ నటి కస్తూరి శంకర్(ఫైల్ ఫోటోలు)

వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా(Amit Shah) చెన్నైలో పర్యటిస్తుండటం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. పలువురు ఇతర పార్టీల నేతలు, సినీ సెలబ్రిటీలు బీజేపీలో చేరబోతున్నారన్న ప్రచారం జరుగుతోంది.

  • Share this:
    దక్షణాదిలోని తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ సినీ ప్రేక్షకులకు సుపరిచయమైన నటి కస్తూరి శంకర్. అన్నమయ్య చిత్రంతో తెలుగు ప్రేక్షకుల మెప్పు పొందింది. పెళ్లి తర్వాత నటనకు గుడ్‌బై చెప్పినా...ఆ తర్వాత కొంతకాలానికే బుల్లితెరపై రీ-ఎంట్రీ ఇచ్చిన కస్తూరి....నిత్యం ఏదో ఒక వివాదంతో మీడియా నోళ్లలో నానుతోంది. బిగ్ బాస్ తమిళ్ సీజన్-3లో పాల్గొన్నందుకు తనకు ఇవ్వాల్సిన పేమెంట్ ఇప్పటి వరకు ఇవ్వలేదంటూ మొన్న ఆ మధ్య ఆమె చేసిన వ్యాఖ్యలు దుమారంరేపాయి. తాజాగా మరో వార్తతో ఆమె తమిళ మీడియా నోళ్లలో నానుతున్నారు. కస్తూరి రాజకీయ ఎంట్రీకి సంబంధించిన వార్త ఇది. కస్తూరి బీజేపీలో చేరబోతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.

    తమిళనాడు అసెంబ్లీకి వచ్చే ఏడాది ఏప్రిల్-మే మాసాల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అక్కడ పార్టీ బలోపేతంపై బీజేపీ పెద్దలు ఇప్పటికే  ప్రత్యేక ఫోకస్ పెట్టారు. ఈ నేపథ్యంలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా శనివారం చెన్నైలో పర్యటిస్తుండటం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. అమిత్ షా చెన్నై పర్యటన సందర్భంగా ఇతర పార్టీల నేతలతో పాటు కొందరు సినీ సెలబ్రిటీలు కూడా బీజేపీ తీర్థం పుచ్చుకోవచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సినీ నటి కస్తూరి కూడా బీజేపీలో చేరుతారన్న ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. బీజేపీలో చేరికపై చర్చించేందుకు... శుక్రవారం సాయంత్రం ఆమె బీజేపీ తమిళనాడు రాష్ట్రాధ్యక్షుడు ఎల్. మురుగన్‌తో రహస్యంగా సమావేశమైనట్లు తమిళ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

    amit shah in chennai, kasthuri shankar, kasturi to join bjp, bharatiya janata party, home minister amit shah, chennai, కస్తూరి శంకర్, అమిత్ షా చెన్నై పర్యటన, చెన్నైలో అమిత్ షా, బీజేపీ, భారతీయ జనతా పార్టీ
    కస్తూరి శంకర్ (Kasturi Shankar/instagram)


    తాను అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరనున్నట్లు మీడియాలో జరుగుతున్న ప్రచారంపై కస్తూరి స్పందించింది. ఉదయం నుంచే పలువురు తనకు ఫోన్ చేసి ఈ విషయంపై ఆరా తీస్తున్నట్లు తెలిపారు. నిజం కంటే వదంతులు ఎంత శక్తివంతమైనవో ఇప్పుడు మరోసారి రుజువయ్యిందని ఆమె పేర్కొంది. తాను షష్టిను పురస్కరించుకుని శుక్రవారం సాయంత్రం మురుగ స్వామి(సుబ్రహ్మణ్యస్వామి) ని కలిసిన మాట వాస్తవమే కానీ...బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు ఎల్ మురుగన్‌ను కలుసుకోలేదంటూ ట్వీట్ చేశారు.



    తాను బీజేపీలో చేరబోతున్నట్లు ఎలా పుకార్లు మొదలయ్యాయో తెలుసుకోవాలన్న ఆసక్తి తనకు కలుగుతున్నట్లు కస్తూరి పేర్కొన్నారు.
    Published by:Janardhan V
    First published: