సెక్స్ చేస్తూ చనిపోయిన హీరో తండ్రి.. ఆత్మకథలో ఆసక్తికరమైన విషయాలు..

Matthew McConaughey: వినడానికి కాస్త విచిత్రంగా అనిపించినా కూడా ఇదే నిజం. నిజంగానే ఓ హీరో తండ్రి సెక్స్ చేస్తూ చనిపోయాడు. అసలు విషయం ఏంటంటే ప్రముఖ హాలీవుడ్ నటుడు, ఆస్కార్ విజేత మ్యాథ్యూ మెక్ కనాగే..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: October 20, 2020, 5:33 PM IST
సెక్స్ చేస్తూ చనిపోయిన హీరో తండ్రి.. ఆత్మకథలో ఆసక్తికరమైన విషయాలు..
ప్రతీతాత్మక చిత్రం
  • Share this:
వినడానికి కాస్త విచిత్రంగా అనిపించినా కూడా ఇదే నిజం. నిజంగానే ఓ హీరో తండ్రి సెక్స్ చేస్తూ చనిపోయాడు. అసలు విషయం ఏంటంటే ప్రముఖ హాలీవుడ్ నటుడు, ఆస్కార్ విజేత మ్యాథ్యూ మెక్ కనాగే తన జీవితంలో జరిగిన కొన్ని విషయాల గురించి చెప్పుకొచ్చాడు. ఈయన ఆస్కార్ కూడా గెలుచుకుని హాలీవుడ్‌లో స్టార్ హీరోగా వెలిగిపోతున్నాడు. ఈ మధ్యే తన జీవితంలో జరిగిన కొన్ని ముఖ్యమైన సంగతులను పుస్తకం రూపంలో తీసుకొచ్చాడు. అందులో కొన్ని సంచలన విషయాలు కూడా రాసుకొచ్చాడు మ్యాథ్యూ. ఈ పుస్తకం ప్రస్తుతం వైరల్ అవుతుంది. మెక్ కనాగే తన జీవితంలో ఎదురైన కొన్ని సంఘటనలకు అక్షర రూపం ఇచ్చాడు. తన వ్యక్తిగత విషయాలతో పాటు తండ్రి మరణం గురించి కూడా చెప్పుకొచ్చాడు. అక్టోబర్ 20వ తేదీన ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఆ తర్వాత తన జీవితం గురించి మాట్లాడుతూ మెక్ కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు చెప్పుకొచ్చాడు. మ్యాథ్యూ మెక్ కనాగే రొమాంటిక్ కామెడీ చిత్రాలతో హాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్నాడు.
హాలీవుడ్ హీరో మ్యాథ్యూ మెక్ కనాగే (matthew mcconaughey)
హాలీవుడ్ హీరో మ్యాథ్యూ మెక్ కనాగే (matthew mcconaughey)


ఈయన నటించిన ది వెడ్డింగ్ ప్లానర్, హౌటూ లూజ్ ఏ గయ్ ఇన్ 10 డేస్, ఫెయిల్యూర్ టు లాంచ్ ఫూల్స్, గోల్డ్ ఘోస్ట్ ఆఫ్ గర్లఫ్రెండ్స్ పాస్ట్ లాంటి సినిమాలు ఈయనకు గుర్తింపు తీసుకొచ్చాయి. ది లింకన్ లాయర్, బెర్నీ మ్యాజిక్ మైక్ ది వూల్ఫ్ ఆఫ్ వాల్, స్ట్రీట్ కిల్లర్ జో చిత్రాలతో స్టార్ ఇమేజ్ సంపాదించాడు. తాజాగా ఈయన నుంచి వచ్చిన గ్రీన్లైట్స్ బుక్ కూడా సంచలనం సృష్టిస్తుంది. తన ఆత్మకథలో తండ్రి మరణం గురించి ఆయన ప్రస్తావించిన తీరు అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది.
హాలీవుడ్ హీరో మ్యాథ్యూ మెక్ కనాగే (matthew mcconaughey)
హాలీవుడ్ హీరో మ్యాథ్యూ మెక్ కనాగే (matthew mcconaughey)

తనకు నాన్న అంటే నాకు ఎంతో ఇష్టమని.. అయితే ఆయన తన అమ్మతో సెక్స్ చేస్తున్నప్పడు గుండెపోటుతో చనిపోయాడని సంచలన నిజం బయట పెట్టాడు మ్యాథ్యూ. ఇది తన జీవితంలో అత్యంత విషాదకర ఘటన అంటూ చెప్పుకొచ్చాడు ఈయన. తన తల్లిదండ్రుల జీవితం ప్రత్యేకమైందని.. ఎన్నోసార్లు వాళ్లు విడిపోయి కలిసారని చెప్పుకొచ్చాడు. ఏదేమైనా కూడా సెక్స్ చేస్తూ తండ్రి చనిపోయిన విషయాన్ని అంత ఓపెన్‌గా చెప్పడం మాత్రం ధైర్యమే.
Published by: Praveen Kumar Vadla
First published: October 20, 2020, 5:31 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading