Black Adam Amazon Prime Streaming : అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఇంగ్లీష్, హిందీ, తమిళం , తెలుగు భాషలలో స్ట్రీమింగ్ కోసం ‘బ్లాక్ ఆడమ్’ చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది. మార్చి03,2023 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో జౌమీ కొలెట్ –సెర్రా (జంగిల్ క్రూయిజ్) రచించి దర్శకత్వం వహించగా, డ్వేన్ జాన్సన్, తో పాటుగా డానీ గ్రాసియా, హిరామ్ గ్రాసియా, బ్లూ ఫ్లిన్ నిర్మించిన ‘బ్లాక్ ఆడమ్’ చిత్ర స్ట్రీమింగ్ అవుతోంది. డీసీ ఎక్స్‌టెండెడ్ యూనివర్శ్ అభిమానులు ఇప్పుడు ఉత్సాహా పూరితమైన యాక్షన్ ఎడ్వెంచర్ చిత్రం, బ్లాక్ ఆడమ్‌ను యాంటీ హీరో చిత్రంగా ఆస్వాదించవచ్చు. ఇది డీసీ ఎక్స్‌టెండెడ్ యూనివర్స్ అభిమానుల చేత ఉత్కంఠ భరితమైన ప్రయాణం చేయిస్తూనే తన మంత్రముగ్ధులను చేసే ప్రదర్శనలు మరియు యాక్షన్ ప్యాక్డ్ విజువల్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
‘బ్లాక్ ఆడమ్’ చిత్రంలో డ్వేన్ జాన్సన్ నాయకునిగా టెత్ ఆడమ్ పాత్రలో కనిపిస్తారు. అతను సర్వశక్తవంతమైన దేవతల శక్తిని కలిగి ఉంటాడు. పురాతన కాన్‌దాక్ (ఊహాజనిత మధ్య ప్రాచ్య దేశం)లో అతనిని దాదాపు 5వేల సంవత్సరాల పాటు ఖైదీగా తన శక్తులను దుర్వినియోగం చేసినందుకు బంధిస్తారు. ఈ చిత్రంలో స్వేచ్ఛా జీవితం పొందిన బ్లాక్ ఆడమ్ యొక్క విపరీతమైన ఆవేశం నుంచి ఉద్భవించిన తనదైన వినూత్నమైన న్యాయంతో ప్రతీకారేచ్ఛతో రగులుతుంటాడు. అతనికి న్యాయ సమాజంలో ఆధునిక తరపు హీరోలు సవాలు విసురుతారు.
ఈ హీరోలలో హాక్‌మ్యాన్‌గా అల్డీస్ హోడ్జ్ (‘సిటీ ఆన్ హిల్’, ‘ఒన్ నైట్ ఇన్ మియామీ’) ; ఆటమ్ స్మాషర్‌గా నోవా సెంటినియో (‘టు ఆల్ ద బాయ్స్ ఐ లవ్డ్ బిఫోర్’) ; సారా షాహీ (‘సెక్స్/లైఫ్’, ‘రష్ అవర్ 3’), మార్వా కెంజరీ (‘మర్డర్ ఆన్ ద ఓరియెంట్ ఎక్స్‌ప్రెస్’, ‘అల్లాదిన్’), సైక్లోన్‌గా క్వింటెస్సా స్విండెల్ (‘వొయోజర్స్’, ‘ట్రింకెట్స్’) ; మొహమ్మద్ అమెర్ (‘మో’, ‘రమీ’), బోధి సబోగ్యు(‘ఏ మిలియన్ లిటిల్ థింగ్స్’) మరియు డాక్టర్ ఫేట్‌గా పియర్సీ బ్రాస్నన్ ( జేమ్స్ బాండ్ మరియు ‘మామా మియా’ ఫ్రాంచైజీలు) నటించారు.
న్యూ లైన్ సినిమా నుంచి, డీసీ లో వచ్చిన ఓ క్యారెక్టర్ ఆధారంగా బ్లాక్ ఆడమ్ కథను అన్వేషించిన మొట్టమొదటి చిత్రమిది. బిల్ పార్కర్ మరియు సీసీ బెక్ సృష్టించగా, కొల్లెట్ –సెర్రా దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లేను ఆడమ్ స్టికీల్ మరియు రోరీ హైన్స్, సోరాబ్ నోషిర్వానీ అందించారు. ప్రైమ్ వీడియోపై మార్చి 15, 2023 నుంచి ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు భాషలలో స్ట్రీమింగ్ కోసం ‘బ్లాక్ ఆడమ్’ చిత్రం అందుబాటులో ఉంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Amazon prime, Hollywood, Tollywood