హమ్మయ్య.. ‘బాహుబలి 2’ రికార్డ్ క్రాస్ చేయలేకపోయిన ‘అవెంజర్స్ ఎండ్‌గేమ్’

హమ్మయ్య ఇపుడు మన భారతీయ సినీ అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఎందుకంటే ఈ శుక్రావారం వాల్డ్ వైడ్‌గా విడుదలైన ‘అవెంజర్స్ ఎండ్‌గేమ్’ సినిమాకు ఏ హాలీవుడ్ సినిమాకు లేనంత హైప్ వచ్చింది. తాజాగా ఈ మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ మాత్రం మన బాక్సాఫీస్ దగ్గర బాహుబలి 2ను క్రాస్ చేయలేకపోయింది.

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: April 30, 2019, 7:48 AM IST
హమ్మయ్య.. ‘బాహుబలి 2’ రికార్డ్ క్రాస్ చేయలేకపోయిన ‘అవెంజర్స్ ఎండ్‌గేమ్’
అవెంజర్స్ ఎండ్‌గేమ్
  • Share this:
హమ్మయ్య ఇపుడు మన భారతీయ సినీ అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఎందుకంటే ఈ శుక్రావారం వాల్డ్ వైడ్‌గా విడుదలైన ‘అవెంజర్స్ ఎండ్‌గేమ్’ సినిమాకు ఏ హాలీవుడ్ సినిమాకు లేనంత హైప్ వచ్చింది. అంతేకాదు..ఈ సినిమా దెబ్బకు బాలీవుడ్,టాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీ సినిమాలు తమ చిత్రాలను పోస్ట్ పోన్ చేసుకున్నాయంటే ‘అవెంజర్స్ ఎండ్‌గేమ్’ సినిమాకున్న క్రేజ్ ఎలాంటిదో చెప్పకనే చెప్పింది. మార్వెల్ సంస్థ తెరకెక్కించిన సూపర్ హిట్ సిరీస్‌లో లాస్ట్ సినిమాగా తెరకెక్కిన ఈ సినిమాకు మన దేశంలో భారీగా అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి. అంతేకాదు సింగిల్ స్క్రీన్ థియేటర్స్‌ కలిపి మొత్తంగా 2845 స్క్రీన్స్‌లో ఈ సినిమా పెద్ద ఎత్తున రిలీజ్ కావడంతో ఈ సినిమా మన దేశంలో రికార్డులను తిరగరాయడం ఖాయం అనుకున్నారు.

Avengers Endgame, Avengers Endgame release date, Avengers Endgame release date in India, Avengers Endgame leaked online, Avengers Endgame leaked online by TamilRockers, film piracy, piracy, piracy websites, Russo Brothers, Tamil rockers, TamilRockers.com, TamilRockers, movies. My best, అవెంజర్స్ ఎండ్ గేమ్, అవెంజర్స్ మూవీ, అవెంజర్స్ లీక్, సినిమా, పైరసీ, లీక్, బాక్సాఫీస్, పైరసీ మూవీ రిలీజ్, సినిమా లీక్,
అవెంజర్స్ ఎండ్ గేమ్ (Image : Twitter)


అంతేకాదు ఇప్పటి వరకు మన దేశంలో తొలి రోజు వసూళ్లలో అగ్ర స్థానంలో ఉన్న ‘బాహుబలి 2’ రికార్డులను ‘అవెంజర్స్ ఎండ్‌గేమ్’ ఈజీగా క్రాస్ చేస్తుందని అందరు అనుకున్నారు. ‘బాహుబలి 2’ సినిమా తొలి రోజు రూ.63 కోట్లను వసూలు చేయగా.. ‘అవెంజర్స్ ఎండ్‌గేమ్’ సినిమ ా మాత్రం రూ.53.10 కోట్లను వసూళు చేసింది.ఇక మన దేశంలో శంకర్ దర్శకత్వంలో రజినీకాంత్,అక్షయ్ కుమార్ హీరోలుగా తెరకెక్కిన 2.O మూవీ రూ.59 కోట్లతో సెకండ్ ప్లేస్‌లో ఉంది. ఇక బాలీవుడ్ చిత్రం ‘థగ్స్ ఆఫ్ హిందూస్థాన్’ రజినీకాంత్ ‘కబాలి’ చిత్రాలు నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచాయి.
First published: April 30, 2019, 7:47 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading