విజయ్ సేతుపతిపై మండి పడుతున్న హిందూ సంఘాలు..

Vijay Sethupathi: విజయ్ సేతుపతికి తెలుగులో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇక్కడ కూడా ఈయన సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటికే సైరాలో చిరంజీవితో కలిసి నటించాడు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: May 9, 2020, 2:24 PM IST
విజయ్ సేతుపతిపై మండి పడుతున్న హిందూ సంఘాలు..
విజయ్ సేతుపతి (vijay sethupathi)
  • Share this:
విజయ్ సేతుపతికి తెలుగులో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇక్కడ కూడా ఈయన సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటికే సైరాలో చిరంజీవితో కలిసి నటించాడు. ఇప్పుడు ఆయన మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా వస్తున్న ఉప్పెనలోనూ విలన్‌గా నటించాడు విజయ్. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈయనపై హిందూ సంఘాలన్నీ మండి పడుతున్నాయి. ముఖ్యంగా ఈయన ఈ మధ్యే హిందూ దేవుళ్ళపై చేసిన కొన్ని కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అదే వివాదానికి దారి తీస్తున్నాయి. హిందూ దేవుళ్లకు సంబంధించిన పూజలపై ఈయన చేసిన వ్యాఖ్యలు ఆగ్రహం తెప్పిస్తున్నాయి.
విజయ్ సేతుపతి (vijay sethupathi)
విజయ్ సేతుపతి (vijay sethupathi)


ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరకోమంటూ విజయ్ సేతుపతికి వార్నింగ్ ఇస్తున్నారు హిందూ సంఘాలు. హిందూ దేవుళ్లకు జరిగే అభిషేకం, అలంకరణ, కైంకర్యాలను తప్పుబడుతూ ఓ టీవీ ఛానల్‌లో విజయ్ సేతుపతి ఈ మధ్యే కొన్ని వ్యాఖ్యలు చేసాడు. అవి సంచలనం సృష్టించాయి.. వివాదాస్పదం కూడా అయ్యాయి. తాజాగా విజయ్ వ్యాఖ్యలపై అఖిల భారత హిందూ మహాసభ ఆగ్రహం వ్యక్తం చేస్తూ చెన్నై నగర పోలీసు కమిషనర్‌కు లేఖ కూడా రాసింది. విజయ్ సేతుపతిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది.
విజయ్ సేతుపతి (vijay sethupathi)
విజయ్ సేతుపతి (vijay sethupathi)

విజయ్ సేతుపతి చేసిన అర్థం లేని వ్యాఖ్యలతో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని ఆ లేఖలో పేర్కొంది హిందూ సంఘం. ఆయన ఎందుకలా మాట్లాడాల్సి వచ్చిందని నిలదీసింది.. కారణం చెప్పాలని డిమాండ్ చేసింది. సొంత ప్రచారం కోసం హిందూ మతమే దొరికిందా అంటూ ఆయనపై మండిపడ్డారు. ఇక సోషల్ మీడియాలో కూడా విజయ్ సేతుపతి చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతుంది. నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు.. మీమ్స్ చేసి పోస్ట్ చేస్తున్నారు. విమర్శలు పెరిగిపోతున్న తరుణంలో విజయ్ ముందుకొచ్చి క్లారిటీ ఇస్తాడేమో చూడాలిక.
Published by: Praveen Kumar Vadla
First published: May 9, 2020, 2:24 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading