సినీనటుడు ప్రకాష్ రాజ్‌పై ఫిల్మ్‌చాంబర్‌కు ఫిర్యాదు

ఇటీవల ఓ వార్తా ఛానెల్ చర్చలో పాల్గొన్న ప్రకాశ్‌రాజ్ మాట్లాడుతూ. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌పై తీవ్ర విమర్శలు చేశారు.

news18-telugu
Updated: October 31, 2019, 12:18 PM IST
సినీనటుడు ప్రకాష్ రాజ్‌పై ఫిల్మ్‌చాంబర్‌కు ఫిర్యాదు
ప్రకాశ్ రాజ్(ఫైల్ ఫోటో)
  • Share this:
ప్రముఖు సినీనటుడు ప్రకాష్ రాజ్‌పై ఫిల్మ్‌చాంబర్‌కు ఫిర్యాదు అందింది. హిందూ దేవుళ్లు, హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ప్రకాశ్‌రాజ్‌ వ్యాఖ్యలు చేశారంటూ.... అఖిల భారత హిందూ మహాసభ ఫిర్యాదు చేసింది. ఆయనను సినిమాల నుంచి బహిష్కరించాలంటూ కర్ణాటక చలనచిత్ర వాణిజ్య మండలికి మహాసభ కార్యకర్తలు కంప్లైంట్ చేశారు. కన్నడ సినిమాల్లో ఆయనకు అవకాశం ఇవ్వొద్దని కోరారు. అయినప్పటికీ ఆయనకు అవకాశాలు కల్పిస్తే తమ పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

ఇటీవల ఓ వార్తా ఛానెల్ చర్చలో పాల్గొన్న ప్రకాశ్‌రాజ్ మాట్లాడుతూ. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌పై తీవ్ర విమర్శలు చేశారు. యూపీలో రథోత్సవానికి ముంబై నుంచి మోడళ్లను రప్పించి వారి ముఖాలకు రంగులు వేసి సీతారామలక్ష్మణుల వేషాలు వేయించారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఐఏఎస్ అధికారులు కూడా వారికి నమస్కరిస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి చాలా ప్రమాదకరమన్నారు ప్రకాష్ రాజ్. దీంతో ఈ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన హిందూ మహాసభ ప్రకాశ్‌రాజ్‌పై ఫిర్యాదు చేసింది.

First published: October 31, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>