Home /News /movies /

HINDU COMMUNITY LEADERS HAVE LODGED A COMPLAINT ON TRISHA WEARING SANDALS IN THE TEMPLE NR

Heroine Trisha: త్రిషను అరెస్ట్ చెయ్యండి.. ఆలయంలో అలాంటి తప్పు చేసిందంటూ హిందూ సంఘాలు ఫైర్!

Heroine Trisha

Heroine Trisha

Heroine Trisha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఇదిలా ఉంటే డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కనున్న పొన్నియిన్ సెల్వన్ సినిమాలో కీలక పాత్రలో నటిస్తుంది. ఇటీవలే ఈ సినిమా షూటింగులో ప్రత్యేక పూజలు చేసి పాల్గొన్నది.

ఇంకా చదవండి ...
    Heroine Trisha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఇదిలా ఉంటే డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కనున్న పొన్నియిన్ సెల్వన్ సినిమాలో కీలక పాత్రలో నటిస్తుంది. ఇటీవలే ఈ సినిమా షూటింగులో ప్రత్యేక పూజలు చేసి పాల్గొన్నది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ బిజీలో ఉంది. ఇదిలా ఉంటే త్రిష ఆలయంలో ఒక తప్పు చేసింది.

    భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విక్రమ్, కార్తీ, జయం రవి, ఐశ్వర్య రాయ్ వంటి పలువురు కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ షూటింగ్ ఇండోర్ లో జరుగుతుంది. ఈ సినిమా చారిత్రాత్మక కథ నేపథ్యంలో తెరకెక్కనుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగులో హీరోయిన్ త్రిష పాల్గొనగా షూటింగ్ సెట్ లోకి శుక్రవారం రోజు కారు దిగి శివుడు, నంది విగ్రహాల మధ్య నడుచుకుంటూ వచ్చింది. కానీ ఆ దేవుడి విగ్రహాల మధ్య నడిచి వచ్చిన సమయంలో తన కాళ్లకు చెప్పులను వేసుకొని ఉంది.

    పైగా కొన్ని సన్నివేశాలను కూడా చిత్రీకరింగా.. దర్శకుడు మణిరత్నం, త్రిష పై కేసు నమోదు చేయాలని హిందూ సంఘాల నేతలు మండిపడ్డారు. హిందువులు పవిత్రంగా పూజించే శివుడు, నంది విగ్రహాలు ఉన్న ప్రాంతంలో అలా రావడం సరైనది కాదు అని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటీవలే దర్శకుడు మణిరత్నం పై కూడా మరో కేసు నమోదైన సంగతి తెలిసిందే.

    Heroine Trisha
    Heroine Trisha


    హైదరాబాద్ లో ఈ సినిమా షూటింగ్ సమయంలో ఈ సినిమా కోసం తీసుకొచ్చిన కొన్ని గుర్రాలలో ఒక గుర్రం డీహైడ్రేట్ కారణంగా మరణించింది. దీంతో ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో పూడ్చి పెట్టగా కొందరు డైరెక్టర్ మణిరత్నం పై పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. ఇక మరో సారి త్రిష చెప్పులు వేసుకొని వచ్చినా కూడా పట్టించుకోలేదు అంటూ పైగా అలాగే కొన్ని సన్నివేశాలను కూడా చేశారు అంటూ మళ్లీ మరో కేసు పెట్టారు.
    Published by:Navya Reddy
    First published:

    Tags: Hindu community leaders, Tollywood, Trisha, Trisha sandals

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు