Home /News /movies /

HINDU ACTIVISTS SLAMS TOLLYWOOD SINGER MANGLI OVER HER LATEST BONALU SONG 2021 SK

Singer Mangli: మంగ్లీ బోనాల పాటపై దుమారం.. అసలేంటి వివాదం? అందులో ఏముంది?

మంగ్లీ బోనాల పాట (Image:Mangli Official/Youtube)

మంగ్లీ బోనాల పాట (Image:Mangli Official/Youtube)

Mangli Bonalu Song: కొందరు నెటిజెన్లు మాత్రం సింగర్ మంగ్లీకి మద్దతుగా నిలిచారు. అందులో ఆమె తప్పేం లేదని.. సాంగర్ లిరిక్స్ ఆమె రాయదని చెప్పారు. కేవలం పాట పాడడంతో పాటు అందులో నటించిందని అంటున్నారు. అంతేతప్ప ప్రతి చిన్న దాన్నీ భూతద్దంలో పెట్టి చూడకూడదని అభిప్రాయపడుతున్నారు.

ఇంకా చదవండి ...
    సింగర్ మంగ్లీ తన స్పెషల్ సాంగ్స్‌తో తెలుగు రాష్ట్రాల్లో ఎంతో పాపులర్ అయ్యారు. తెలుగు పండగలకు ప్రతి ఏటా ప్రత్యేక గీతాలను విడుదల చేస్తుంటారు. ఆ సాంగ్స్‌ ఇప్పటికే లక్షలాది...కోట్లాది వ్యూస్ సంపాదించాయి. ప్రస్తుతం బోనాల పాట కూడా ఊపేస్తోంది. యూబ్యూబ్‌ను షేక్ చేస్తోంది. జులై 11న మంగ్లీ అఫీషియల్ యూట్యూబ్ ఛానెల్‌‌లో విడుదలైన ఈ పాటకు.. ఇప్పటికే 40 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. 'చెట్టు కింద కూసున్నవమ్మా.. సుట్టం లెక్క ఓ మైసమ్మా..' అంటూ సాగే ఈ పాటన హైదరాబాద్ బోనాల వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఈ పాటకు రామస్వామి లిరిక్స్, రాకేష్ వెంకటాపురం మ్యూజిక్ అందించారు. మంగ్లీ ఆ పాటను పాడడంతో పాటు స్క్రీన్‌పై కూడా తానే కనిపించారు. ఢీ ఫేమ్ పండు కొరియోగ్రఫీ చేశారు. విడుదలైన కొన్ని రోజుల్లోనూ మిలియన్స్ వ్యూస్ సంపాదించుకున్న ఆ పాటపై ప్రస్తుతం వివాదం నెలకొంది. పాట లిరిక్స్‌పై కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.


    బోనాల పండగ వేళ అమ్మవారిని కీర్తిస్తూ పాటలు పాడాలి గానీ.. విమర్శిస్తూ పాడడం ఏంటని కొంత మంది హిందూ సంఘాల కార్యకర్తలు మండిపడుతున్నారు. పాటలో కొన్ని అభ్యంతరకర పదాలు ఉన్నాయని.. వాటిని వెంటనే మార్చాలని ఆర్‌జే కిరణ్ విమర్శించారు. అంతేకాదు పబ్లిక్‌గా క్షమాపణలు చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. కొద్దిగా ఫేమ్ రాగానే కళ్లు నెత్తికెక్కాయంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇప్పటికే పబ్లిసిటీ కోసం ఎంతో మంది హిందూ దేవతను విమర్శిస్తున్నారని.. ఇప్పుడు గ్రామ దేవతలపై కూడా పడ్డారా? అని మండిపడ్డారు. ఆర్‌జే కిరణ్ వీడియోను సమర్థిస్తూ.. కొందరు మంగ్లీ తీరును తప్పుబట్టుతున్నారు.


    ఐతే కొందరు నెటిజెన్లు మాత్రం సింగర్ మంగ్లీకి మద్దతుగా నిలిచారు. అందులో ఆమె తప్పేం లేదని.. సాంగర్ లిరిక్స్ ఆమె రాయదని చెప్పారు. కేవలం పాట పాడడంతో పాటు అందులో నటించిందని అంటున్నారు. అంతేతప్ప ప్రతి చిన్న దాన్నీ భూతద్దంలో పెట్టి చూడకూడదని అభిప్రాయపడుతున్నారు. దేవుళ్లపై నిందా స్తుతి కొత్తేం కాదని.. శ్రీమంజునాథ సినిమాలోనూ శివుడిని విమర్శిస్తూ పాట ఉందని గుర్తు చేస్తున్నారు. పబ్లిసిటీ కోసం ప్రతి విషయాన్ని కాంట్రవర్సీ చేయడం ఈ మధ్య ప్యాషన్ అయిపోయిందని ఆమె అభిమానులు కామెంట్ చేస్తున్నారు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Bonalu 2021, Telangana, Telangana Bonalu, Tollywood

    తదుపరి వార్తలు