సబా కమర్.. ‘హిందీ మీడియం’ అనే హిందీ సినిమాతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన పాకిస్థానీ నటి. ఆ సినిమాలో తన నటనకు మంచి మార్కులే పడ్డాయి. హిందీ మీడియంలో ఇర్ఫాన్ ఖాన్‌కు పోటీగా సబా కమర్ నటించిందనే చెప్పోచ్చు. ఇక ఆ తర్వాత సబా కబర్ మరే హిందీ సినిమాలోను నటించలేదు. ఇక అది అలా ఉంటే సబా కమర్ ఆ మధ్య ఓ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుంటున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. పాకీస్థాన్‌ను చెందిన అజీమ్‌ఖాన్‌ను పెళ్లాడుతున్నట్లు ఆమె ప్రకటించింది. కాగా తాజాగా ఆమె మరో ప్రకటన చేసింది. ఈ ప్రకటనలో అతన్ని పెళ్లి చేసుకోవాట్లేదని తెలిపింది. ఇటీవలే వీరిద్దరికీ నిశ్చితార్థం అయింది. అంతలోనే ఈ నిర్ణయం బాలీవుడ్‌ను షాక్‌కు గురిచేసిందనే చెప్పోచ్చు. దీనికి సంబంధించి ఓ ప్రకటనను ఆమె తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ సందర్భంగా ఆమె రాస్తూ.. వ్యక్తిగత కారణాల వల్లే నిశ్చితార్థం తర్వాత పెళ్లికి నో చెప్పినట్లు ఆమె పేర్కోంది. ప్రస్తుతానికి అజీమ్ ఖాన్‌తో పెళ్లి విషయం పక్కకు పెట్టినట్లు తెలిపింది. అంతేకాదు కొన్ని కారణాల వల్ల ఈ పెళ్లి రద్దు చేసుకోవాల్సి వచ్చిందని.. తెలిపింది. ఇక ఎప్పటిలాగే తనను.. తన డిసీజన్‌ను సపోర్ట్ చేయాలనీ ఆమె తన ఫాలోవర్స్‌ను వేడుకుంది. ఈ సందర్భంగా ఆమె మరో విషయాన్ని కూడా తెలిపింది. ఇంత వరకూ అజీమ్ ఖాన్‌తో ఫోన్‌లోనే మాట్లాడానని.. నేరుగా కలిసింది లేదని తెలిపింది.
ఇది కఠిన నిర్ణయమే అయినా తప్పలేదని పేర్కొంది. ఇది ఇలా ఉంటే సబాతో నిశ్చితార్థం తర్వాత అజీమ్‌పై ఓ మహిళ లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడమే ఈ పెళ్లి రద్ధు కారణమని తెలుస్తోంది.
View this post on Instagram
ఇక ఇన్‌స్టాగ్రామ్ ద్వారా సబా చేసిన పెళ్లి రద్ధు ప్రకటనకు రెస్పాండ్ అయ్యాడు అజీమ్‌ఖాన్. సబా కమర్ చాలా మంచి మనిషి అని.. ఆ దేవుడు ఆమెకు అన్నివేళలా విజయాన్ని అందించాలని కోరుకుంటున్నట్టు పేర్కొన్నాడు. పెళ్లి రద్ధుకు సంబంధించి పూర్తి బాధ్యతను తానే తీసుకుంటున్నట్టు అజీమ్ పేర్కొన్నాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Tollywood Movie News