క్యాన్సర్‌తో భాదపడుతున్న హీరో ఆయుష్మాన్‌ ఖురానా భార్య

బాలీవుడ్‌ యువ హీరో ఆయుష్మాన్‌ ఖురానా..ఇంతకు ముందు 'విక్కిడోనర్', 'బరేలీ కి బర్పీ', 'అందాదున్' లాంటీ విజయవంతమైన సినిమాల ద్వారా హింది సినిమాలో మంచిపేరు సంపాదించాడు. అయితే..ఆయన సతీమణి తహీరా కశ్యప్‌ రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది.

news18-telugu
Updated: January 17, 2019, 6:26 AM IST
క్యాన్సర్‌తో భాదపడుతున్న హీరో ఆయుష్మాన్‌ ఖురానా భార్య
Ayushman and his wife Tahira Kashyap
  • Share this:
బాలీవుడ్‌ యువ హీరో ఆయుష్మాన్‌ ఖురానా..ఇంతకు ముందు 'విక్కిడోనర్', 'బరేలీ కి బర్పీ', 'అందాదున్' లాంటీ విజయవంతమైన సినిమాల ద్వారా హింది సినిమాలో మంచిపేరు సంపాదించిన సంగతి తెలిసిందే. అయితే..ఆయన సతీమణి తహీరా కశ్యప్‌ రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో గత కొన్ని రోజులుగా ఆమె వ్యాధికి చికిత్స తీసుకుంటున్నారు. అయితే తాజాగా ఆమెకు కీమో థెరపీ చికిత్స జరుగుతోంది. ఈ విషయాన్ని సోషల్‌మీడియా వేదికగా తెలుపుతూ.. వీడియోలు షేర్‌ చేశారు అయుష్మాన్. ఇది ఓ ప్రత్యేకమైన ప్రయాణమని అన్నారు. తన కోసం ప్రార్థనలు చేసిన వారికి ధన్యవాదాలు చెప్పారు.

అంతేకాకుండా ఆయన భార్య... తహీరా క్యాన్సర్‌తో బాధపడుతున్న చాలా మందిలో ధైర్యం నింపుతూ ఓ పోస్ట్‌ కూడా చేశారు. 'హలో వరల్డ్‌. నేనే కొత్తగా వచ్చా.. ఇదిగో ఇప్పుడు ఇలా ఉన్నా.. చాలా స్వేచ్ఛగా ఉన్నట్లు అనిపిస్తోంది అని రాశారు. ఇంకా ఆమె తన పోస్ట్‌లో .. 'స్నానం చేసేటప్పుడు జుట్టుతో సమస్యలే ఉండవు. నేను గుండుతో ఉంటానని ఎప్పుడూ అనుకోలేదు, కానీ ప్రస్తుతం బాగానే ఉన్నా' అంటూ తన ఫొటోలను షేర్‌ చేశారు. ఈ పోస్ట్‌.. అందులో వున్న భాద ప్రేక్షక హృదయాలను తాకింది. దీంతో ఆమె కోలుకోవాలనీ  సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు..అభిమానులు

Pics: ‘సింబా’ సక్సెస్‌తో బాలీవుడ్‌లో మరోసారి ప్రూవ్ అయిన ఖాకీ పవర్

First published: January 17, 2019, 6:23 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading