హోమ్ /వార్తలు /సినిమా /

Actor Arun Bali passes away : ప్రముఖ హిందీ నటుడు అరుణ్ బాలి కన్నుమూత.. ప్రముఖుల సంతాపం..

Actor Arun Bali passes away : ప్రముఖ హిందీ నటుడు అరుణ్ బాలి కన్నుమూత.. ప్రముఖుల సంతాపం..

Hindi Actor Arun Bali passes away at the age of 79 years in Mumbai Photo : Twitter

Hindi Actor Arun Bali passes away at the age of 79 years in Mumbai Photo : Twitter

Actor Arun Bali passes away : ప్రముఖ హిందీ నటుడు అరుణ్ బాలి(79) కన్నుమూశారు. అరుణ్ బాలి, రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో వచ్చిన 3 ఇడియట్స్, పీకే వంటి హిట్ సినిమాలతో పాటు అనేక సీరియళ్లు, సినిమాల్లో ఆయన నటించి పాపులర్ అయ్యారు. అంతేకాదు పలు టీవీ షోల్లోనూ సందడి చేశారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

ప్రముఖ హిందీ నటుడు అరుణ్ బాలి(79) (Actor Arun Bali passes away) కన్నుమూశారు. అరుణ్ బాలి, రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో వచ్చిన 3 ఇడియట్స్, పీకే వంటి హిట్ సినిమాలతో పాటు అనేక సీరియళ్లు, సినిమాల్లో ఆయన నటించి పాపులర్ అయ్యారు. అంతేకాదు పలు టీవీ షోల్లోనూ సందడి చేశారు. మస్తీనియా గ్రావిస్ అనే అరుదైన నాడీ కండరాల వ్యాధితో బాధపడుతున్న అరుణ్ బాలి ఈరోజు (Actor Arun Bali passes away) మరణించారు. అరుణ్ బాలి చివరగా అమితాబ్ బచ్చన్, రష్మిక మందన్న, నీనా గుప్తా నటించిన లేటెస్ట్ సినిమా 'గుడ్ బైలో నటించారు. ఈ సినిమా ఈరోజు విడుదలవుతోంది. ఇక బాలి మృతిపై  (Actor Arun Bali) హిందీ చిత్రసీమ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు. న్యూరోమస్కులర్ సమస్య, మస్తీనియా గ్రావిస్‌తో బాధపడుతున్న అరుణ్ బాలి, 79 ఏళ్ల వయసులో అక్టోబర్ 7న ముంబైలో కన్నుమూసినట్లు ప్రముఖ వార్తా సంస్థ ANI తెలిపింది. మస్తీనియా గ్రావిస్, నరాలు మరియు కండరాల మధ్య కమ్యూనికేషన్ వైఫల్యం వల్ల ఏర్పడే వ్యాధి.

ఇక బాలి పర్సనల్ విషయానికి వస్తే.. అతను 1991 పీరియడ్ డ్రామా చాణక్యలో కింగ్ పోరస్ పాత్రను పోషించాడు. అంతేకాదు అరుణ్ బాలి, కుంకుమ్‌లోని హర్షవర్ధన్ వాధ్వా వంటి పాత్రలను పోషించి ప్రసిద్ధి చెందారు. ఇక బాలీ నటించిన మరో లేటెస్ట్ సినిమా 11 ఆగస్టు 2022న విడుదలైన అమీర్ ఖాన్ లాల్ సింగ్ చద్ధా.. ఈ సినిమా హాలీవుడ్ సినిమా ఫారెస్ట్ గంప్‌కు రీమేక్‌గా వచ్చింది. ఈ సినిమాలో ఓల్డ్ మాన్ ఇన్ ట్రైన్‌ పాత్రలో కనిపించారు.బాలి నటించిన ఇతర ప్రముఖ సినిమాల విషయానికి వస్తే.. ఆయన '3 ఇడియట్స్', 'కేదరినాథ్', 'పానిపట్' వంటి అనేక ఇతర చిత్రాలలో నటించి మెప్పించారు.

ఇక ఇటీవల కాలంలో టాలీవుడ్‌లోను వరుసగా మరణాలు సంభవిస్తున్నాయి.. మహేష్ తల్లీ ఇందిరా దేవి కన్నుమూసిన సంగతి తెలిసిందే.. ఆమె సెప్టెంబర్ 28న కన్నుమూశారు.  ఈ యేడాది జనవరిలో పెద్ద కుమారుడు రమేష్ బాబు కన్నుమూసిన ఘటన మరవక ముందే తాజాగా కృష్ణ సతీమణి ఇందిరా దేవి కన్నమూయడం విషాదకరం.  ఆమె వయసు 70 యేళ్లు. కృష్ణ, ఇందిరా దేవి దంపతులకు మహేష్ బాబు, రమేష్ సహా ఐదుగురు సంతానం. వీళ్లు కాకుండా మరో ముగ్గురు ఆడపిల్లలు పద్మావతి, మంజుల, ప్రియదర్శిని ఉన్నారు. ప్రియదర్శిని భర్త సుధీర్ బాబు తెలుగులో హీరోగా నటిస్తున్నారు. గత కొంత కాలంగా ఇందిరా దేవి అనారోగ్యంతో బాధపడుతున్నారు. మరోవైపు పెద్ద కుమారుడు రమేష్ బాబు మృతితో ఆమె కృంగి పోయారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం ఆమె ఇంట్లోనే తుది శ్వాస విడిచారు.

ఇక సెప్టెంబర్ 11న మరో ప్రముఖ నటుడు కృష్ణంరాజు కన్నుమూశారు. దీంతో ఒక్కసారిగా సినీ ఇండస్ట్రీ శోక సంద్రంలోకి మునిగిపోయింది. 83 ఏళ్ల కృష్ణంరాజు అనారోగ్యానికి వయోభారమే కారణమని.. వేరే సమస్యలు లేవని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే గత కొంతకాలం నుంచి అనారోగ్యంతో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. కృష్ణంరాజు  1940 జనవరి 20న పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో జన్మించారు. కృష్ణంరాజుకు భార్య శ్యామలా దేవి, ముగ్గురు కుమార్తెలు.

First published:

Tags: Amitabh bachchan, Rashmika mandanna, Tollywood news

ఉత్తమ కథలు