Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. రేటింగ్ లో కూడా మొదటి స్థానంలో దూసుకెళ్తుంది. ఇక పిల్లలిద్దరూ డబ్బులు కోసం మంచం దగ్గరికి వెళ్లి డబ్బులు తీసుకున్న సమయంలో పేపర్ కింద పడిపోతుంది. ఇక పిల్లలిద్దరు డబ్బులను లెక్క పెట్టుకునే పనిలో ఉంటారు. మరోవైపు పోలీస్ స్టేషన్ లో మోనిత కార్తీక్ ఇంట్లో పేపర్ చదవచ్చు అని దీప రియాక్షన్ ఎలా ఉంటుందో అని తలుచుకుంటూ తెగ నవ్వుకుంటుంది.
ఇక పిల్లలు డబ్బులు అన్నీ లెక్క పెట్టడం పూర్తయ్యాక సౌర్య ఆ పేపర్ వైపు చూసి అందులో ఉన్న వార్త చదివి షాక్ అవుతుంది. మోనిత ఆంటీ అబద్ధాలు చెప్పిందే ఏమో అని ఏడుస్తారు. ఇక డాడీ నిజంగా మోనిత ఆంటీ ని మోసం చేశాడా అంటూ పిల్లలిద్దరూ మాట్లాడుకుంటారు. మరోవైపు ఇంట్లో సౌందర్య మనవళ్ళు తమ ఇంటికి వెళ్లడానికి బయలుదేరుతారు. ఇక సౌందర్య వారిద్దరిని ఉండమని చెబితే పిల్లలిద్దరూ మమ్మీ త్వరగా వచ్చేయమని గట్టిగా వార్నింగ్ ఇచ్చింది అంటూ చెబుతారు.
ఆనందరావు ఇల్లు ఇక్కడే అంటున్నారు కదా మనం కూడా వెళ్లి వాళ్లను పంపించి అమ్మాయిని చూసి వద్దాం అనేసరికి.. సౌందర్య తను నా పై కోపం గా ఉందేమో అని మాట్లాడుతుందా అని అంటుంది. ఇక పిల్లలతో కలిసి కార్లో వెళ్ళిపోతారు.ఇక దీప ఇంట్లో న్యూస్ పేపర్ కోసం ఎంత వెతికినా కూడా పేపర్ కనిపించకపోవడంతో టెన్షన్ పడుతుంది. పిల్లలు ఏమైనా తీసారా అంటూ టెన్షన్ పడుతుంది. ఇక పిల్లలిద్దరూ బాధపడుతూ ఒక దగ్గర కూర్చోగా కార్తీక్ వాళ్ళను చూసి పిలుస్తాడు.
ఇది కూడా చదవండి:మళ్లీ మొదటికి వచ్చిన కార్తీకదీపం.. వంటలక్క కష్టాలు పగవాడికి కూడా రాకూడదు దేవుడా
ఇక వాళ్ళు ఎంతకూ రాకపోయేసరికి కార్తీక్ వాళ్ళ దగ్గరికి వెళ్లి కూర్చుంటాడు. ఇక పిల్లలిద్దరూ అక్కడి నుంచి వెళ్లి పోతారు. కార్తీక్ ఏమైందో అని ఆలోచనలో పడతాడు. పిల్లల దగ్గరికి వెళ్లి మాట్లాడినా కూడా పిల్లలు వినిపించుకోరు. అంతలోనే దీప వస్తుంది. ఇక హిమ సౌర్యను తీసుకొని వెళ్ళి పోతుంది. కార్తీక్ బాధపడుతూ పిల్లలు మాట్లాడటం లేదని దీప తో చెప్పి బాధపడతాడు. ఏం జరిగిందో అంటూ టెన్షన్ పడతాడు. దీప మనసులో పిల్లలు పేపర్ చదివారేమో అని భయపడుతుంది. డాక్టర్ బాబుకు ఈ విషయం చెప్పద్దు అని ఆలోచిస్తుంది. ఇక తరువాయి భాగం లో మోనిత దగ్గరికి దీప వెళ్లి పేపర్లో అలా వేయడం ఆపేయు అని అడగగా.. కార్తీక్ తో పెళ్లి చేపిస్తే అన్ని ఆపేస్తాను అంటూ లేదంటే నేను చేసేది చేస్తాను అంటూ గట్టిగా మాట్లాడుతుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Archana ananth, Doctor babu, Karthika deepam, Monitha, Nirupam paritala, Premi Viswanath, Shobashetty, Soundarya, Vantalakka