HIMA AND SOURYA CONFRONT KARTHIK WHEN HE ASKS DEEPA NOT TO COOK IN KARTHIKA DEEPAM SERIAL NR
Karthika Deepam: వంటలక్కపై సీరియస్ అయిన డాక్టర్ బాబు.. చివరికి పిల్లలు కూడా?
karthika deepam
Karthika Deepam: స్టార్ మా లో ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ గురించి తెలుగు రాష్ట్రాలలో తెలీనోలే లేరు. ప్రస్తుతం ఈ సీరియల్ సినిమాలకంటే ఎక్కువ రేటింగ్ ను పెంచుకుంటుంది
Karthika Deepam: స్టార్ మా లో ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ గురించి తెలుగు రాష్ట్రాలలో తెలీనోలే లేరు. ప్రస్తుతం ఈ సీరియల్ సినిమాలకంటే ఎక్కువ రేటింగ్ ను పెంచుకుంటుంది. అన్ని సీరియల్ లో కంటే కార్తీకదీపం మొదటి స్థానంలో ఉంది. ఇక స్టార్ మా కు అత్యధిక రేటింగ్ ఈ సీరియల్ తోనే వస్తుందని చెప్పవచ్చు. ఇక ఇందులో నటించే దీప, కార్తీక్ లు గతంలో విడిపోయి ఎప్పుడు కలుస్తారని ప్రేక్షకుల కళ్ళల్లో ఎదురుచూపులు ఇప్పుడు నిజమవుతున్న తరుణంలో మళ్లీ కొత్త కొత్త ట్విస్ట్ లతో సరికొత్తగా ప్రసారమవుతుంది కార్తీకదీపం.
ప్రస్తుతం దీపం అనారోగ్య సమస్యతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఇక కార్తీక్ తన ఆరోగ్యం కోసం ఎంతో శ్రద్ధ తీసుకుంటున్న తరుణంలో.. దీప మీద ఉన్న కోపం పక్కనపెడితే.. అసలు తన ఆరోగ్యం గురించి ఇంతలా ఎందుకు శ్రద్ధ తీసుకుంటున్నాడని.. దీప బాగా ఆలోచిస్తుంది. అంతేకాకుండా మోనిత, భారతీ లను ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నాడని.. తన అనారోగ్య సమస్యకు కార్తిక్ ఇంతలా ఎందుకు చేస్తున్నాడని.. ఏదో బలమైన కారణం ఉందని అనుకుంటుంది. ఇక తన వెనకాల ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి తన మొండితనం ఏంటో చూపిస్తా అంటూ వంటలక్కగా గరిట తిప్పడానికి సిద్ధమవుతుంది.
ఇక కుటుంబ సభ్యులంతా దీప ఆరోగ్యం గురించి ఆలోచిస్తారు. ఇక మోనిత కార్తీక్ దక్కించుకోవడం కోసం తను పడే పోరాటం గురించి ప్రియమణి చూసి జాలి పడుతుంది. సౌందర్య తన కోడలు ఆరోగ్యం మంచిగా అవ్వాలని దేవుడిని కోరుకుంటుంది. ఇక దీప రంగంలోకి దిగుతూ.. కిచెన్ లోకి అడుగు పెడుతుంది. ఇక పిల్లలు నాన్న తిడుతాడని అంటున్న కూడా వినిపించుకోకుండా తన గరిట తిప్పడానికి సిద్ధంగా ఉంటుంది. ఇది చూసిన కార్తీక్ కోపంతో రగిలిపోతూ దీప పై మండిపడతాడు. ఇక అందరూ టిఫిన్ చేస్తున్న సమయంలో కార్తీక్ బయట నుంచి టిఫిన్ తెప్పించుకోగా.. అతని ఇష్టాన్ని అతనికే వదిలేసింది సౌందర్య. ఇక తన కొడుకును సపోర్ట్ చేస్తున్నందుకు సౌందర్య పై కాస్త కోపం అవుతుంది దీప. ఇక ఆ తర్వాత ఏం జరుగుతుందో తర్వాత ఎపిసోడ్ లో చూద్దాం.
Published by:Navya Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.