హోమ్ /వార్తలు /సినిమా /

Bollywood Drugs Case : బాలీవుడ్‌లో డ్రగ్స్ కలకలం... రవీనా రియాక్షన్ ఇదీ

Bollywood Drugs Case : బాలీవుడ్‌లో డ్రగ్స్ కలకలం... రవీనా రియాక్షన్ ఇదీ

 రవీనా టాండన్ Photo : Twitter

రవీనా టాండన్ Photo : Twitter

Bollywood Drugs Case :  బాలీవుడ్‌లో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారిన డ్రగ్స్‌పై  ప్రముఖ బాలీవుడ్ నటి రవీనా టాండన్ సంచలన వ్యాఖ్యలు చేసింది.

బాలీవుడ్‌లో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారిన డ్రగ్స్‌పై  బాలీవుడ్ నటి రవీనా టాండన్ సంచలన వ్యాఖ్యలు చేసింది. సుశాంత్ మృతి కేసు నేపథ్యంలో వెలుగు చూసిన బాలీవుడ్ డ్రగ్స్ కేసు.. రోజుకో మలుపుతో పాటు కొత్త పేర్లు వినబడుతున్నాయి. ఇప్పటికే ఈ కేసులో సుశాంత్ మాజీ ప్రియురాలు విచారణను ఎదుర్కుంటుండగా.. ఈ లిస్ట్‌లో రకుల్ పేరు హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. కాగా తాజాగా దీపికా పేరుతో పాటు మహేష్ బాబు భార్య నమ్రత పేరు కూడా వినబడింది. ఈ నేపథ్యంలో హిందీ నటి రవీనా టాండన్ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. బాలీవుడ్’లో మాదకద్రవ్యాలను సమూలంగా తీసివేయడానికి ఇదే మంచి తరుణం అంటూ సోషల్ మీడియా వేదికగా వ్యాఖ్యానించింది.

బాలీవుడ్ లో మాదకద్రవ్యాల విషయంలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో చురుకుగా పరిశోధిస్తున్న తరుణంలో రవీనా టాండన్ చేసిన ట్వీట్ మరింత హీట్‌ను పెంచింది. డ్రగ్స్ కేసుపై రవీనా టండన్ ట్వీట్ చేస్తూ.. ``కూకటివేళ్లతో సహా.. మొత్తం క్లీన్ చేయాల్సిన సమయం వచ్చింది.. ఇది స్వాగతించాల్సిన అంశం. ఈ చర్య భవిష్యత్ తరాలకు ఎంతో ఉపయోగపడుతుంది.. డ్రగ్స్ భూతాన్ని కూకటివేళ్లతో పెకలించేయండి.. డ్రగ్స్ వాడినవారిని.. అమ్మిన వారిని.. డీలర్స్ ని అందరినీ శిక్షించాల్సిందే.. వీటి కారణంగా లాభపడ్డ పెద్ద వారిని కూడా వదలోద్దు`` అంటూ తన ట్విట్టర్ వేదికగా కోరింది.

రవీనా టాండన్ సినిమాల విషయానికి వస్తే.. అటు బాలీవుడ్ సహా ఇటు సౌత్ ఇండస్ట్రీస్ లోనూ పాపులర్. రవీనా నందమూరి బాలకృష్ణ సరసన రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో వచ్చిన `బంగారు బుల్లోడు` చిత్రంలో నటించి అదరగొట్టింది. ఆ సినిమాలో రవీనా తన అందచందాలతో తెలుగు వారి మనస్సులను కొల్లగొట్టింది. ఆ తర్వాత ఆకాశ వీధిలో, రధసారధి, పాండవులు పాండవులు తుమ్మెద (2014) మొదలగు చిత్రంలోనూ రవీనా నటించింది.

First published:

Tags: Bollywood news, Raveena Tandon

ఉత్తమ కథలు