హోమ్ /వార్తలు /సినిమా /

ప్ర‌భాస్ కేసులో కీల‌క మ‌లుపు.. అధికారుల‌పై కోర్ట్ సీరియ‌స్..

ప్ర‌భాస్ కేసులో కీల‌క మ‌లుపు.. అధికారుల‌పై కోర్ట్ సీరియ‌స్..

ప్రభాస్ ( ఫైల్ ఫోటో )

ప్రభాస్ ( ఫైల్ ఫోటో )

ప్ర‌భాస్ గెస్ట్ హౌజ్ కేస్ నానా మ‌లుపులు తిరుగుతుంది. ఎప్పుడూ వివాదాల్లో లేని ప్ర‌భాస్ తొలిసారి చాలా పెద్ద భూ వివాదంలో ఇరుక్కున్నాడు. ఎలాగైనా త‌న గెస్ట్ హౌజ్ ద‌క్కించుకోవాల‌ని చూస్తున్నాడు. ఇక ఇప్పుడు ఈ భూవివాదంపై ప్ర‌భాస్ దాఖలు చేసిన పిటిషన్ విచారణను కోర్టు జ‌న‌వ‌రి 3కి వాయిదా వేసింది.

ఇంకా చదవండి ...

  ప్ర‌భాస్ గెస్ట్ హౌజ్ కేస్ నానా మ‌లుపులు తిరుగుతుంది. ఎప్పుడూ వివాదాల్లో లేని ప్ర‌భాస్ తొలిసారి చాలా పెద్ద భూ వివాదంలో ఇరుక్కున్నాడు. ఎలాగైనా త‌న గెస్ట్ హౌజ్ ద‌క్కించుకోవాల‌ని చూస్తున్నాడు ఈ యంగ్ రెబ‌ల్ స్టార్. రాయ‌దుర్గంలోని తన ఇంటిని రెవిన్యూ అధికారులు సీజ్ చేసారు. ఇది జ‌రిగి కూడా 20 రోజులు అవుతుంది. అప్ప‌ట్నుంచి ఈ కేస్ కోర్టులో ఉంది. ఏ విష‌యం అయినా కూడా కోర్టులోనే తేల్చుకుంటానంటున్నాడు ప్ర‌భాస్.


  aఅంతేకాదు.. దీనిపై పూర్తి వివ‌రాలు కావాలంటూ అధికారుల‌ను కోర్టు నిల‌దీసింది. తన గెస్ట్ హౌస్ సీజ్ చేయడంపై ప్రభాస్ కోర్టులో పిటిషన్ వేయగా.. దానికి రెవెన్యూ అధికారులు కౌంటర్ దాఖలు చేసారు. ఇప్పుడు ఈ విష‌యం రాను రాను ఇంకా సీరియ‌స్ అయిపోతుంది.


  రెగ్యులైజేషన్ కోసం ప్రభాస్ పెట్టుకున్న పిటిష‌న్ ను ఎందుకు వెన‌క్కి పంపారు.. దాన్ని ఎందుకు మీరు పరిశీలనలోకి తీసుకోలేదు అంటూ అధికారులను కోర్టు ప్ర‌శ్నించింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలను జ‌న‌వ‌రి 3న కోర్టు ముందు ఉంచుతాం అని తెలిపారు. సుప్రీం కోర్టు తీర్పు ఆధారంగా చూపించి.. తన గెస్ట్ హౌజ్ ఉన్న స్థలాన్ని బలవంతంగా ఖాళీ చేయించడానికి అధికారులు ప్రయత్నించినట్లు ప్ర‌భాస్ త‌న పిటిషన్ లో తెలిపాడు. మ‌రి ఇది ఎక్క‌డ ఆగుతుందో అనేది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.


  పాయల్ రాజ్ పుత్ హాట్ ఫోటోషూట్..
  ఇది కూడా చదవండి..

  2019లో విడుదల కాబోతున్న భారీ చిత్రాలు ఇవే..


  #FlashBack2018: బాక్సాఫీస్‌‌ డుమ్మా కొట్టిన హీరోలు


  క‌ళ్లు చెదిరేలా ప్ర‌భాస్ దొంగ‌త‌నం.. ‘సాహో’లో ఆ సీన్ సంచ‌ల‌నం..


   

  First published:

  Tags: High Court, Prabhas, Telugu Cinema, Tollywood

  ఉత్తమ కథలు