Home /News /movies /

HIGH COURT SERIOUS ABOUT HIKE OF TICKET RATES AND SPECIAL BENEFIT SHOWS FOR PRABHA SAAHO MOVIE TA

‘సాహో’ టికెట్ రేట్ల పెంపుపై హైకోర్టు ఆగ్రహం..

ప్రభాస్ ‘సాహో’ (Youtube/Photo)

ప్రభాస్ ‘సాహో’ (Youtube/Photo)

‘సాహో’ చిత్రానికి ఇష్టమొచ్చినట్టు టికెట్ల రేట్లు పెంచడంపై ప్రముఖ నిర్మాత .. ఏపీ హైకోర్టును ఆశ్రయించాడు. దీనిపై హైకోర్టు..సదరు చిత్ర నిర్మాతలు, దర్శకులుకు నోటీసులు జారీ చేసింది.

    ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘సాహో’. ఈ శుక్రవారమే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. సుజిత్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ టికెట్ రేట్స్ పెంచుకోవడంతో పాటు స్పెషల్ బెనిఫిట్ షోస్‌కు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇలా ఇష్టమొచ్చినట్టు టికెట్ రేట్లు పెంచడంపై ప్రముఖ నిర్మాత నట్టికుమార్.. ఏపీ హైకోర్టును ఆశ్రయించాడు. ‘సాహో’ సినిమాను చూడాలకునుకొనే ప్రేక్షకులను వీక్‌నెస్‌ను చిత్ర నిర్మాతలు క్యాష్ చేసుకుంటున్నారు. ఈ సినిమా టికెట్ రేటును రూ.300 వరకు పెంచారన్నారు. వారి ప్రయత్నాలను అడ్డుకోవాలని నట్టికుమార్ పిటిషన్ దాఖలు చేశాడు. దీనిపై స్పందించిన న్యాయస్థానం ‘సాహో’చిత్ర నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లకు నోటీసులు జారీ చేశారు. దీనిపై వివరణ ఇవ్వాలంటూ ఏపీ హోమ్ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి, విశాఖ పోలీస్ కమిషనర్, సాహో చిత్ర పంపిణిదారు దిల్‌రాజు తదితరులకు నోటీసులు జారీ అయ్యాయి. ఈ కేసులో తదుపరి విచారణ ఈ రోజు కొనసాగనుంది. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం మాత్రం ‘సాహో’చిత్రానికి స్పెషల్ పర్మిషన్ షోస్‌తో పాటు టికెట్ రేట్లు పెంచుకోవడానికి ఎలాంటి అనుమతులు మంజూరు చేయలేదు.
    First published:

    Tags: Dil raju, High Court, Prabhas, Saaho, Saaho Movie Review, Sujeeth, Telugu Cinema, Tollywood, UV Creations

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు