Samantha Akkineni: సమంతకు ‘జబర్ధస్త్’ షాక్.. నోటీసులు ఇచ్చిన హైకోర్టు..
గత కొన్నేళ్లుగా అక్కినేని కోడలు సమంత దూకుడు మాములుగా లేదు. చేసిన సినిమాలు చేసినట్టు బాక్సాఫీస్ దగ్గర దుమ్ము దులుపుతున్నాయి. తాజాగా ఈ భామ నటించిన ఓ సినిమాపై కోర్టు నోటీసులు జారీ చేసింది. వివరాల్లోకి వెళితే..
news18-telugu
Updated: July 25, 2019, 8:01 PM IST

సమంత అక్కినేని లేటెస్ట్ ఫోటో షూట్ (ఫైల్ ఫోటో)
- News18 Telugu
- Last Updated: July 25, 2019, 8:01 PM IST
గత కొన్నేళ్లుగా అక్కినేని కోడలు సమంత దూకుడు మాములుగా లేదు. చేసిన సినిమాలు చేసినట్టు బాక్సాఫీస్ దగ్గర దుమ్ము దులుపుతున్నాయి. ఈ యేడాది తన భర్త నాగ చైతన్యతో చేసిన ‘మజిలీ’ సినిమా సక్సెస్ మాత్రం సమంతకు సెపరేట్ అని చెప్పాలి. రీసెంట్గా ఈ భామ కథానాయికగా నటించిన ‘ఓ బేబి’ కూడా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్నే అందుకుంది. ఈ రకంగా పెళ్లైన తర్వాత కూడా కథానాయికగా సత్తా చూపెడుతుంది. ఇక సమంత.. 2013లో నందిని రెడ్డి దర్శకత్వంలో సిద్దార్ధ్‌తో కలిసి నటించిన ‘జబర్ధస్త్’ సినిమా యాక్ట్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అంతగా నడవలేదు. తాజాగా ఈ భామ అప్పట్లో నటించిన జబర్ధస్త్ సినిమాకు సంబంధించిన డీవీడీలు, వీసీడీలు, బ్లూరే డిస్క్స్ ఫార్మాట్లలో రిలీజ్ చేయడం. టీవీల్లో ప్రసారం చేయడం లాంటివి చేయకూడదని హైకోర్టు ఈ చిత్ర బృందానికి నోటీసులు జారీ చేసింది.

ఈ సినిమాను సాయి గణేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బెల్లంకొండ సురేష్ నిర్మించాడు. తమన్ సంగీతం అందించాడు. ఈ సినిమాను 2010లో రణ్వీర్ సింగ్, అనుష్క శర్మ హీరో, హీరోయిన్లుగా నటించిన ‘బ్యాండ్ బాజా బారాత్’ సినిమానే ఎలాంటి అనుమతి లేకుండా రీమేక్ చేశారు. ఐతే.. యశ్ రాజ్ ఫిల్మ్స్ వాళ్లు ఈ సినిమాను నాని హీరోగా ‘ఆహా కళ్యాణం’ పేరుతో తెలుగులో రీమేక్ చేస్తున్నట్టు అప్పటికే ప్రకటించారు షూటింగ్ కూడా మొదలుపెట్టారు. ‘ఆహా కళ్యాణం’ సినిమా కంటే ముందు అదే కంటెంట్‌తో విడుదలైన ‘జబర్ధస్త్’ విడుదల కావడం ‘ఆహా కళ్యాణం’ సినిమాకు ప్రతికూలంగా మారింది. తాజాగా ఈ కేసును విచారించిన హైకోర్టు ‘జబర్ధస్త్’ సినిమా ఏ ఫార్మాట్లో కూడా ప్రసారం కాకుండా ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం సమంత.. జబర్థస్త్ ఫేమ్ డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వంలో చేసిన ‘ఓ బేబి’ సక్సెస్‌ను ఫుల్‌గా ఎంజాయ్ చేస్తోంది.

సిద్దార్ధ్,సమంత జంటగా నటించిన ‘జబర్ధస్త్’ మూవీ (యూ ట్యూబ్ క్రెడిట్)

షాద్‌నగర్ ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసులకు చిక్కులు...
దిశ నిందితుల అంత్యక్రియలకు బ్రేక్... హైకోర్టు కీలక ఆదేశాలు...
కొత్తగా కట్టిన టీడీపీ ఆఫీస్ కూల్చేయాలని హైకోర్టులో పిటిషన్
దిశా కేసులో కీలక నిర్ణయం... ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్
ఏపీలో జగన్ నిర్ణయంపై హైకోర్టు విచారణ
ఆర్టీసీ కార్మికులకు సీఎం కేసీఆర్ మరో అద్భుత వరం..
Loading...