హోమ్ /వార్తలు /సినిమా /

మెగాస్టార్‌ చిరంజీవికి మెగా రిలీఫ్.. ఆనందంలో ఫ్యాన్స్.. ఇంతకీ జరింగిందంటే..

మెగాస్టార్‌ చిరంజీవికి మెగా రిలీఫ్.. ఆనందంలో ఫ్యాన్స్.. ఇంతకీ జరింగిందంటే..

చిరంజీవి (ఫైల్ ఫోటో)

చిరంజీవి (ఫైల్ ఫోటో)

Chiranjeevi high court case | సినిమా రంగంలో ఒక వెలుగు వెలిగిన చిరంజీవి..ఆ తర్వాత 2008లో  ప్రజారాజ్యం స్థాపించి 2019 ఎన్నికల రణ రంగంలో దిగాడు. ఇక 2014 ఎన్నికల సందర్భంగా చిరంజీవి ఎన్నికల కోెడ్ ఉల్లంఘించాడంటూ ఆయనపై కేసు నమోదు అయింది.

ఇంకా చదవండి ...

  సినిమా రంగంలో ఒక వెలుగు వెలిగిన చిరంజీవి..ఆ తర్వాత 2008లో  ప్రజారాజ్యం స్థాపించి 2019 ఎన్నికల రణ రంగంలో దిగాడు. ఆ ఎన్నికల్లో చిరంజీవికి ఆశా భంగమే ఎదురైంది. దాంతో ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి రాజ్య సభ సభ్యుడై ఆపై కేంద్ర మంత్రి కూడా అయ్యారు. ఇక గత 2014 ఎన్నికల్లో చిరంజీవి కాంగ్రెస్ పార్టీ తరుపున స్టార్  కాంపెనర్‌గా పలువురు అభ్యర్థలు తరుపున ప్రచారం చేసారు. ఐతే 2014 ఏప్రిల్ 27న రాత్రి 10 గంటలు దాటిన తర్వాత చిరంజీవి ఎన్నికల ప్రచారం నిర్వహించాడాని అతనిపై గుంటూరు అరండల్ పేట పోలీసులు గతంలో కేసు నమోదు చేశారు. దీనిపై ఉమ్మడి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో బుధవారం విచారణ జరిగింది. ఇరు పక్షాల వాదన విన్న హైకోర్టు..ఈ కేసును రద్దు చేస్తూ తీర్పు నిచ్చింది. ఈ కేసు పట్ట మెగా అభిమానులతో పాటు ఆయన కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.


  ప్రస్తుతం చిరంజీవి..రాజకీయాలకు దూరంగా ఉంటూ సినిమాలే లోకంగా బతుకుతతున్నాడు. ప్రెజెంట్ మెగాస్టార్ చిరంజీవి సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ చరణ్ నిర్మాణంలో  ‘సైరా నరిసింహారెడ్డి’ సినిమా చేస్తున్నాడు. ఈసినిమాను దసరా కానుకగా రిలీజ్ చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు.


   

  First published:

  Tags: Chiranjeevi, High Court, Telugu Cinema, Tollywood

  ఉత్తమ కథలు