ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేష్‌కు కరోనా పాజిటివ్ రావడంతో అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ముందు ఈయన తనకు లేదని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేసినా కూడా తర్వాత అసలు విషయం బయటికి వచ్చింది. ఈయనకు కరోనా సోకడంతో ఇప్పుడు టాలీవుడ్ అలర్ట్ అయింది.
గత రెండు మూడు రోజులుగా కలిసిన మనుషులు కూడా కరోనా బారిన పడినట్లు తెలుస్తుంది. తనకు కరోనా సోకిందని తెలియక చాలా మందిని కలిసాడు బండ్ల గణేష్. దాంతో ఇఫ్పుడు వాళ్లంతా కూడా టెస్టులు చేయించుకుంటున్నారు. బండ్ల గణేష్ ఉండే వీధిలోనే నాగశౌర్య కూడా ఉంటున్నాడు.
దాంతో ఆయనకు కూడా కరోనా భయం ఉన్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే తాను అపోలో లేదా కాంటినెంటల్ హాస్పిటల్లో చికిత్స కోసం చేరనున్నానని.. ప్రస్తుతానికి హోమ్ క్వారంటైన్లో తెలిపాడు బండ్ల గణేష్. ఈ మధ్యే హెయిర్ ప్లాంటేషన్ కోసం వెళ్లగా అనారోగ్య లక్షణాలను చూసిన అక్కడి డాక్టర్ కరోనా టెస్ట్‌కు రిఫర్ చేసారు.. దాంతో ఆయన టెస్టు చేయించుకోగా పాజిటివ్ అని తేలింది. దాంతో వెంటనే టాలీవుడ్ ప్రముఖులు కూడా అలర్ట్ అవుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bandla Ganesh, Telugu Cinema, Tollywood