హీరోయిన్స్‌ కాంప్రమైజ్ కావల్సీందే: తమన్నా..

తమన్నా..ప్రస్తుతం టాలీవుడ్‌లో టాప్‌లో ఉన్న హీరోయిన్‌లలో ఒకరు. ఆమె ఓ ఇంటర్వ్యూలో హీరోయిన్ల గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

news18-telugu
Updated: April 15, 2019, 3:20 PM IST
హీరోయిన్స్‌ కాంప్రమైజ్ కావల్సీందే: తమన్నా..
తమన్నా భాటియా
news18-telugu
Updated: April 15, 2019, 3:20 PM IST
తమన్నా..ప్రస్తుతం టాలీవుడ్‌లో టాప్‌లో ఉన్న హీరోయిన్‌లలో ఒకరు. అంతేకాదు.. ఇటీవల బ్లాక్ బస్టర్ అయిన F2 సినిమాలో కీలక పాత్ర పోషించి సినిమా విజయంలో ప్రముఖ పాత్ర వహించారు. ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సినిమాల్లో హీరోయిన్లకు ఉండే ప్రాధాన్యత గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమన్నా..  మాట్లాడుతూ..ప్రస్తుతం సినిమాలు తెరకెక్కించే విషయంలో దర్శకుల ఆలోచన చాలా మారిందని.. హీరోయిన్ల కోసం కూడా దర్శకులు కథలు సిద్ధం చేస్తున్నారని అన్నారు. దీంతో.. స్టార్ హీరోల చిత్రాలకు ధీటుగా హీరోయిన్స్ ఓరియెంటెడ్ సినిమాలు వస్తున్నా యన్నారు. అయితే.. హీరోయిన్ పాత్ర ఎలా ఉండాలనేది డిసైడ్ చేసేది కథ అని... ప్రతి సారి హీరోలతో పోటీ పడే కథలు రావాలంటే కుదరదన్నారు. నిర్మాతలు డబ్బులు పెట్టి తీస్తారు..కాబట్టి కమర్షియల్ చిత్రాలు కొన్ని నియమాలకు లోబడి తీయాల్సీ ఉంటుందని.. హీరోయిన్ అన్నాక.. కొన్ని ఇబ్బందులు తప్పవని.. వాటన్నింటికి సర్దుకుపోయి రాణించాల్సి ఉంటుందని పేర్కోన్నారు.

First published: April 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...