హోమ్ /వార్తలు /సినిమా /

Tanishq Rajan: దర్శకుడు ఏం చెబితే అది చేస్తా.. సినిమాపై కుర్ర హీరోయిన్ ఇంట్రెస్ట్!

Tanishq Rajan: దర్శకుడు ఏం చెబితే అది చేస్తా.. సినిమాపై కుర్ర హీరోయిన్ ఇంట్రెస్ట్!

Tanishq Rajan (Photo Twitter)

Tanishq Rajan (Photo Twitter)

Nenevaro: రంగస్థల నటిగా కెరీర్‌ ప్రారంభించిన తనిష్క్ రాజన్.. నేనెవరో అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో సినిమాపై తనకున్న మక్కువ బయటపెడుతూ ఓపెన్ అయింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

రంగస్థల నటిగా కెరీర్‌ ప్రారంభించిన తనిష్క్ రాజన్ (Tanishq Rajan).. భారత దేశ వ్యాప్తంగా ఎన్నో నాటకాలు వేశారు. పన్నెండేళ్ల వయసులో ఆమె తన సోదరితో కలిసి ముంబైకి వెళ్లడంతో వెండితెరపై ప్రయాణం మొదలైంది. టీవీ రంగంలో ప్రకటనలు చేసే స్థాయి నుంచి సౌత్ ఇండియన్ సినిమాల్లో నటించే స్థాయికి ఎదిగారు. 2017లో శరణం గచ్చామి (Sharanam Gacchami) అనే సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు. ఆమె తన నటన, అందంతో అందరినీ మెప్పించారు.

దీంతో ఆమెకు దేశంలో దొంగలు పడ్డారు, ఇష్టంగా, బైలంపూడి, కమిట్‌మెంట్ అనే సినిమాల్లో ఆఫర్లు వచ్చాయి. ఇక ఇప్పుడు ఆమె నేనెవరో (Nenevaro) అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించనున్నారు. ఈ చిత్రం డిసెంబర్ 2న థియేటర్లో విడుదల కానుంది. ఇప్పుడు తన చేతిలో ఎన్నో ఆసక్తికరమైన ప్రాజెక్టులున్నాయని , హిందీలో సినిమాలు, వెబ్ సిరీస్‌లు కూడా చేస్తున్నానని తెలిపారు. రీసెంట్‌గా ఆమె నటించిన దో లోగ్ అనే ప్రైవేట్ ఆల్బమ్‌ యూట్యూబ్‌లో సంచలనంగా మారింది.

మంచి కథలను ఎంచుకుంటూ తనిష్క్.. తన నటనతో అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఇలాంటి చిత్ర పరిశ్రమలో అవకాశాలు అందిపుచ్చుకోవడం అంత సులభమైన పనేమీ కాదని తనిష్క్ చెప్పుకొచ్చారు. కష్టపడి పని చేస్తే, మనసుకు నచ్చిన పని చేస్తే.. మనల్ని ఏది ఆపలేదు అని అన్నారు. నేను దర్శకుడు ఏం చెబితే అది చేసే నటిని. ఆయన విజన్‌కు తగ్గట్టుగా నటించేందుకు ప్రయత్నిస్తాను.

నా ప్రయాణం ఇంకా మొదలవ్వలేదని అనుకుంటాను.. అందుకే నేను ఇంకా ఇంకా కష్టపడి పని చేయాలని అనుకుంటున్నాను. ప్రేక్షకులందరి ప్రేమను సంపాదించుకోవాలని ప్రయత్నిస్తూనే ఉంటాను. శాస్త్రీయ సంగీతం, నృత్య కళల్లోనూ ప్రావీణ్యం ఉందని తనిష్క్ తెలిపారు. తాను అనుకున్నది సాధించేందుకు ఎక్కడా కూడా కాంప్రమైజ్ కానని తనిష్క్ తన సినీ ప్రయాణం, లక్ష్యం గురించి వివరించారు.

First published:

Tags: Cinema, Telugu heroine, Tollywood

ఉత్తమ కథలు